నేపియర్‌లో రెండో వన్డే: కివీస్ ఓపెనర్ గప్టిల్ దూరం
హైదరాబాద్: చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న గప్టిల్ రెండో వన్డేకు అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ అఫీసియల్స్ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

సోమవారం (జనవరి 30)వ తేదీన ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 61 పరుగులతో ఆకట్టుకున్న గప్టిల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం నేపియర్‌లో జరగనున్న రెండో వన్డేకు గప్టిల్ దూరం కావడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బే.
గప్టిల్ గాయంపై న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సాన్ మాట్లాడుతూ రెండో వన్డేకి గప్టిల్ దూరమైన హామిల్టన్‌లో జరగనున్న మూడో వన్డేకి అందుబాటులో వస్తాడని తెలిపాడు. ఇక గప్టిల్ స్థానంలో డీన్ బ్రౌన్ లీ చోటు కల్పించారు. 2014లో చివరిసారి న్యూజిలాండ్ జట్టుకు ఆడిన బ్రౌన్ లీ దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications