Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లబుషేన్‌ 'హ్యాట్రిక్‌' సెంచరీ.. ఆసీస్‌ 248/4

Australia vs New Zealand: Marnus Labuschagne scores third Test ton in a row

పెర్త్‌: ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న ఆ్రస్టేలియా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (202 బంతుల్లో 110 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, సిక్స్‌) మరో సెంచరీ చేసాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో న్యూజిలాండ్‌తో గురువారం ఆరంభమైన డే/నైట్‌ టెస్టు (తొలి టెస్ట్) మ్యాచ్‌లో లబుషేన్‌ అద్భుత ఆటతో సెంచరీ సాధించాడు. లబుషేన్‌ వరుసగా మూడో టెస్టు సెంచరీ బాదడం విశేషం. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ లబుషేన్‌ సెంచరీలు బాదాడు.

లబుషేన్‌ అజేయ సెంచరీతో అలరించడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో గురువారం ఆటముగిసే సమయానికి ఆసీస్ 284/4 స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ జో బర్న్స్‌ (9) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (43)తో కలిసి లబుషేన్‌ పరిస్థితిని చక్కదిద్దాడు. వార్నర్‌ అనంతరం మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ (43; 4 ఫోర్లు) లబుషేన్‌కు మంచి సహకారం అందించాడు.

చివర్లో పుంజుకున్న న్యూజిలాండ్‌ స్మిత్‌ (43)తో పాటు మాథ్యూ వేడ్‌ (12)ను ఔట్ చేసి పైచేయి సాధించింది. సాన్‌ట్నర్‌ వేసిన 74వ ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ కొట్టిన లబుషేన్‌.. తన కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ మూడు శతకాలు ఇటీవలే చేయడం విశేషం. ప్రస్తుతం లబుషేన్‌తో పాటు ట్రావిస్ హెడ్‌ (20 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అయితే మంచి ఆరంభాలు లభించినా.. ఆసీస్ ఆటగాలు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

ఈ మ్యాచ్‌ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ అంపైర్‌ అలీమ్‌ దార్‌ ఓ అరుదైన ఘనతను తన పేరుపై లికించుకున్నారు. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును అలీమ్‌ దార్‌ సొంతం చేసుకున్నారు. ఇది అలీమ్‌ దార్‌కు 129వ టెస్టు మ్యాచ్‌. దీంతో వెస్టిండీస్‌ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌ (128) పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్‌ రికార్డును బద్దలు కొట్టారు.

Story first published: Friday, December 13, 2019, 10:16 [IST]
Other articles published on Dec 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+