
హైదరాబాద్: ప్రపంచకప్‌లో మరో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరకు రంగం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఒక్క భారత్‌తో మినహా మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో మొత్తం 12 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా నిలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో ఓటమి అన్నదే లేకుండా సాగుతున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాకిస్థాన్ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 2015 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతుంటే.. ఈ మెగా టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆసీస్ భావిస్తోంది.
చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ఆసీస్‌ను మట్టికరిపించే నాకౌట్‌లో అడుగుపెట్టాలని కివీస్ పట్టుదలతో ఉంది. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 136 మ్యాచ్‌లు జరగ్గా 90 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 39 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ నెగ్గాయి. ఏడింట్లో ఫలితం తేలలేదు.
{headtohead_cricket_1_4}
ఇక, ప్రపంచకప్ విషయానికి వస్తే ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగ్గా ఏడింట్లో ఆసీస్, మూడు మ్యాచ్‌ల్లో కివీస్ గెలుపొందింది.
జట్ల వివరాలు:
ఆస్ట్రేలియా: అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టాయినీస్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జేసన్ బెహ్న్రెండార్ఫ్
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, కోలిన్ డీ గ్రాండ్‌హోం, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, ఫర్గుసన్, ట్రెంట్ బౌల్ట్