సిరీస్ గెలిచేది ఆస్ట్రేలియానే.. జోస్యం చెప్పిన ఇంగ్లాండ్ మాజీ...


హైదరాబాద్: భారత్‌తో రెండు టెస్టుల అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-1తో సమంగా ఫలితాలను రాబట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా సాధించిన విజయంతో పోలిస్తే పెర్త్‌లో ఆసీస్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఇక మూడో టెస్టులో విజయంతో నిర్ణయాత్మక టెస్టు బాక్సిండే డే టెస్టుకు ఇరు జట్లు సమాయత్తమవుతోన్న తరుణంలో ఇప్పటికే అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సిరీస్ గెలుచుకునేది ఎవరో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ జోస్యం చెప్తున్నాడు. పెర్త్ వేదికగా టీమిండియాను గడగడలాడించిన నాథన్ లయన్ మిగిలిన మ్యాచ్‌లలోనూ విజృంభిస్తాడని పేర్కొన్నాడు. తద్వారా మ్యాచ్ తమ చేతికొస్తుందంటూ వ్యాఖ్యానించాడు.
మరోసారి అదే విషయాన్ని గుర్తు చేసి
ఇప్పటికే రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోకుండా టీమిండియా తప్పు చేసిందని వ్యాఖ్యానించిన ఆయన మరోసారి అదే విషయాన్ని గుర్తు చేశాడు. కేవలం ఫేస్ బౌలింగ్‌తోనే ఆస్ట్రేలియాను కట్డడి చేయాలనుకోవడంలో తప్పును ఎత్తి చూపాడు. ఇక నాలుగో ఫేసర్‌గా తీసుకున్న ఉమేశ్ యాదవ్ సైతం తన వంతు ప్రదర్శన చేయలేకపోవడంతో టీమిండియా ఓడిపోయిందంటూ అభిప్రాపడ్డాడు . ఈ రెండో టెస్టులో మహ్మద్ షమీ సత్తా చాటడంతో ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆ మాత్రమైనా కట్టడిచేయగలిగారు.

లయన్ అదే తరహా ప్రదర్శన చేస్తాడని
ఇక ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా జట్టుకు విజయం చేజిక్కడంలో నాథన్ పాత్ర కీలకం. ఏకంగా రెండు ఇన్నింగ్స్ కలిపి 16వికెట్లను చేజిక్కుంచుకున్నాడు. మరో సారి మెల్‌బౌర్న్ వేదికగా కూడా లయన్ అదే తరహా ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇలాగే ఆడితే ఆసీస్ కచ్చితంగా గెలుస్తుందంటూ జోస్యం చెప్పాడు. అతని చక్కటి ఫామ్ ఆ జట్టు విజయం వైపుకు నడిపిస్తుందన్నాడు.

నాథన్ లయన్ ఆ తేడాని
చివరగా తాను ఆస్ట్రేలియా జట్టు గెలిచితీరుతుందని చెప్తున్నట్లు పేర్కొన్నాడు. ట్విట్టర్ ద్వారా చేసిన పోస్టులో చివరిగా నేను ఆస్ట్రేలియా గెలుస్తుందని భావిస్తున్నాను. నాథన్ లయన్ ఆ తేడా ఏంటో చూపిస్తాడు. మళ్లీ జనవరిలో కలుద్దాం. అంటూ ముగించాడు.

మూడో టెస్టులో గెలిచేందుకు టీమిండియాకు
అయితే ఓటమి పరాభవాన్ని పక్కకుపెట్టిన టీమిండియా బాక్సింగ్ డే టెస్టుకు అన్ని రకాల సిద్ధమవుతోంది. ఇప్పటికే మాజీలు ఆసీస్‌తో పాటు మూడో టెస్టులో గెలిచేందుకు టీమిండియాకు కూడా సమాన అవకాశాలున్నాయంటూ తెలిపారు. అయితే భారత జట్టుకు యువ క్రికెటర్ అయిన పృథ్వీ షా లేకపోవడం ప్రధానలోపం. సీనియర్ ఓపెనర్లు నిలదొక్కుకోకపోవడం మరో సమస్యగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications