Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్‌పై ఆసీస్ కోచ్ ఇలా!

Australia Vs India: Langer unsure what to expect from Perth wicket

హైదరాబాద్: రెండో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ పిచ్‌పై అనిశ్చితి నెలకొని ఉందని ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "పెర్త్ పిచ్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నా.... ఈ వికెట్ దేనికి సపోర్ట్‌గా నిలుస్తుందో చూడాలి. పెర్త్ చరిత్రలో కేవలం నాలుగు రోజుల మ్యాచ్ మాత్రమే జరిగింది" అని అన్నాడు.

"గతంలో పెర్త్ మైదానంలో న్యూ సౌత్ వేల్స్-డబ్ల్యుసీఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని చూశా. ఈ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలం. గతంలో జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో సైతం ఈ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగానే ఉంది. అయితే, భారత్‌తో జరిగే రెండో టెస్టులో పిచ్‌పై అనిశ్చితి నెలకొని ఉంది" అని లాంగర్ పేర్కొన్నాడు.

మరోవైపు పెర్త్‌లోని కొత్త స్టేడియంలో జరిగే రెండో టెస్టు డ్రాప్ ఇన్ వికెట్ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం మొట్టమొదటిసారి ఐదు రోజుల టెస్టు క్రికెట్‌కు ఆతిథ్యమిస్తోంది. గతంలో ఈ స్టేడియంలో నాలుగు రోజుల టెస్టు క్రికెట్ మ్యాచ్ ఆడారు.

Story first published: Tuesday, December 11, 2018, 18:07 [IST]
Other articles published on Dec 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+