For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిగిలింది 6 వికెట్లు.. చేయాల్సింది 219 పరుగులు

Australia vs India, Ist Test, Day 4: As it happened: Indian bowlers call shots

అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పర్యాటక భారత జట్టును గెలుపు ఊరిస్తోంది. అడిలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో కంగారూలు ఆల్‌రౌండ్ వైఫల్యంతో ఓటమి కోరల్లో చిక్కుకున్నారు. అశ్విన్(2/44), మహ్మద్ షమీ(2/15) దెబ్బకు.. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదివారం ఆట చివరకు ఆసీస్ 104/4తో కష్టాల్లో పడింది. మూడో రోజు వర్షం కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి నాలుగో రోజు అరగంట ముందే ఆటను ప్రారంభించారు. పుజారా, రహానేలు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.

219 పరుగులు, 6 వికెట్ల దూరంలో

219 పరుగులు, 6 వికెట్ల దూరంలో

నాలుగో రోజు 153/3తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటై, ఆసీస్‌కు 323 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆదివారం ఆట ముగిసిన అనంతరం విజయానికి కంగారూలు 219 పరుగులు, 6 వికెట్ల దూరంలో నిలిచింది ఆసీస్. షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను ఆదుకున్న హెడ్‌ను ఛేదనలో ఎంత తొంద‌ర‌గా ఔట్ చేస్తే భార‌త్ అంత వేగంగా విజ‌యాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. ఆఖ‌రి రోజు కూడా భార‌త బౌల‌ర్లు ఇదే జోరుతో బౌలింగ్ చేస్తేనే ఫ‌లితం ఉంటుంది.

టాపార్డర్ కుప్పకూల్చిన ఔట్ చేసిన అశ్విన్

టాపార్డర్ కుప్పకూల్చిన ఔట్ చేసిన అశ్విన్

ఛేదనలో ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. 12వ ఓవర్లో అరోన్ ఫించ్(11)ను అశ్విన్ పెవిలియన్ చేర్చి దెబ్బతీశాడు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్ ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మార్కస్ హారీస్(26)ను షమీ, ఉస్మాన్ ఖవాజా(8)ను అశ్విన్ ఔట్ చేసి టాపార్డర్ కుప్పకూల్చారు. తర్వాత హాండ్స్‌కాంబ్, షాన్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా వేట కొనసాగించారు. ఈ జోడీని మహ్మద్ షమీ విడదీశాడు.

లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం చేస్తేనే

లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం చేస్తేనే

ఆఖర్లో షాన్ మార్ష్(31), ట్రావిస్ హెడ్(11) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆటకు సోమవారమే ఆఖరి రోజు, కంగారూలు ఓటమి తప్పించుకోవాలంటే లోయర్ ఆర్డర్ అద్భుత పోరాట నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆసీస్‌ గెలవాలంటే మరో 219 పరుగులు చేయాల్సి ఉంది.

భారత ఇన్నింగ్స్ ఎలా ముగిసిందంటే:

భారత ఇన్నింగ్స్ ఎలా ముగిసిందంటే:

ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న పుజారా (71).. కాసేపటికే స్పిన్నర్‌ లియాన్‌ బౌలింగ్‌లో షార్ట్‌ లెగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు రహానె (70) ఆసీస్‌ బౌలర్లను దాటిగా ఎదుర్కొని కేరీర్‌లో 16వ అర్ధశతకం నమోదు చేశాడు. అతడికి మిగితా బ్యాట్స్‌మెన్‌ సహకారం లేకపోవడంతో భారీ షాట్‌కు ప్రయత్నించి లియాన్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు వెంటవెంటనే పెవిలియన్‌ బాట పట్టారు. రోహిత్‌ (1), పంత్‌ (28), షమీ (0) లియాన్‌ బౌలింగ్‌లో, అశ్విన్‌ (5), ఇషాంత్‌ (0)లు స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు.

1
43623
Story first published: Sunday, December 9, 2018, 15:23 [IST]
Other articles published on Dec 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+