తొలి టెస్టుకు ముందు అందరి .. కింగ్ కోహ్లీపైనే: బీసీసీఐ


న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై 2014-15లో జరిగిన టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించడంతో పాటు 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ గురువారం నుంచి జరగబోయే సిరిస్‌లో సైతం సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కోహ్లీని మాటలతో కవ్వించిన జాన్సన్.. వరుస బౌన్సర్లు విసిరి.. ఒకానొక సమయంలో ఫీల్డింగ్ ముసుగులో కోహ్లీని కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. కానీ, సిరీస్‌లో జాన్సన్‌ని దీటుగా ఎదుర్కొన్న కోహ్లి.. సెంచరీల మోత మోగించాడు.
స్మార్ట్‌ఫోన్లలో కోహ్లీ చిత్రాన్ని బంధించేందుకు
ఇక కొన్ని ఏళ్లుగా చక్కటి ఫామ్‌లో దూసుకెళ్తున్న కోహ్లీపైనే అందరిచూపులు ఉన్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. కోహ్లీ తన కిట్‌బ్యాగ్‌తో నడుచుకుంటూ వస్తుండగా అక్కడే ఉన్న అభిమానులు ఆత్రుతగా అతడిని చూస్తున్నారు. తమ స్మార్ట్‌ఫోన్లలో కోహ్లీ చిత్రాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజంగానే ఆ చిత్రం ఊహకందని ఎన్నో అంచనాలను బయటపెడుతుంది.

గత ఆసీస్ పర్యటనలో నాలుగు సెంచరీలు
పర్యటించిన ప్రతిచోటా విరాట్ దుమ్మురేపుతున్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కొని బాదుడు పని పెట్టుకున్నాడు. బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అన్నట్టు పరుగుల వరద పారించాడు. గత ఆసీస్ పర్యటనలో నాలుగు సెంచరీలు చేశాడు. ఇప్పుడెలా ఆడతాడోనని అందరికీ ఆత్రుతగా ఉంది.దీంతో కోహ్లీని నిలువరించాలని ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు వ్యూహాలు రచిస్తుండగా వాటిని ఛేదించాలని కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

స్మిత్, వార్నర్ సూచనలతో
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు, ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంరింగ్‌కు పాల్పడిన సంఘటన సంచలనం ఆ జట్టు ప్రతిష్టను దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో, అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, వీరిద్దరి సూచనలతో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సస్పెండ్ చేయడం కూడా తెలిసిందే.

అనుకున్నంత సులువుకాదని
ఈ నేపథ్యంలో స్టార్ బ్యాట్స్‌మెన్ కరువైన ఆసీస్ జట్టును సునాయాసంగా చేధించవచ్చంటూ మాజీలు అభిప్రాయపడుతున్నారు. కానీ, అది అనుకున్నంత సులువు కాదని, ఆ ఇద్దరూ లేనంతమాత్రాన ఆసీస్ జట్టు అంత బలహీనమైన జట్టు కాదంటూ ఆసీస్ మాజీలు చెప్పుకొస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications