Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరేమన్నారు!: ఆస్ట్రేలియా గడ్డపై పుజారా తొలి టెస్టు సెంచరీ

Australia Vs India: Cheteshwar Pujara slams first ton in Oz, Twitter calls it a knock to remember

హైదరాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ టెస్టు సిరిస్‌కు ముందు ప్రతి ఒక్కరి దృష్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. అందుకు కారణం గత పర్యటనలో కోహ్లీ మెరుగైన రికార్డుని కలిగి ఉండటమే.

అయితే, అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (3) పరుగులకే పెవిలియన్‌కు చేరి అభిమానులను నిరాశ పరిచాడు. ఇక, ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ సంగతి చెప్పాల్సిన పనిలేదు. దీంతో జట్టు స్కోరు 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పుజారా జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

ఆసీస్ గడ్డపై పుజారా తొలి టెస్టు సెంచరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా

ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా

ఈ క్రమంలో సెంచరీతో చెలరేగాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. అద్భుతమైన ఆటతో క్రీజులో నిలిచిన పుజారా 231 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 16వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై మూడోది కావడం విశేషం.

ఆస్ట్రేలియా గడ్డపై పేస్‌ను ఎదుర్కొవడంలో

ఆస్ట్రేలియా గడ్డపై పేస్‌ను ఎదుర్కొవడంలో

ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన టెస్టులో సైతం పుజారా సెంచరీతో చెలరేగాడు. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై పేస్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడిన పుజారా ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లాడి కేవలం 201 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, గురువారం నుంచి ప్రారంభమైన అడిలైడ్ టెస్టులో తానెంటో మరోసారి నిరూపించాడు.

అడిలైడ్ టెస్టులో పుజారా వన్ మ్యాన్ షో

అడిలైడ్ టెస్టులో పుజారా వన్ మ్యాన్ షో

ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా... వన్ మ్యాన్ షో చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన క్లాస్‌తో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ చేయడంలో పాటు రోహిత్ శర్మ, అశ్విన్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. లంచ్ విరామానికి ముందు అభిమానులను నిరూత్సాహాపరిచిన భారత్ ఇన్నింగ్స్, ఆ తర్వాత పుజారా చెలరేగడంతో భారత గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగేలా చేసింది. లోయర్ ఆర్డర్‌తో కలిసి అడిలైడ్ గ్రౌండ్‌లో పుజారా సాధించిన ఈ సెంచరీ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తప్పక నిలిచిపోతుంది.

123 పరుగులు వద్ద పుజారా రనౌట్

123 పరుగులు వద్ద పుజారా రనౌట్

ఈ మ్యాచ్‌లో 246 బంతుల్లో 123 పరుగులు చేసిన పుజారా రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలిరోజు మొత్తం 85.5 ఓవర్లు పాటు క్రీజులో ఉన్న పుజారా 7 బౌండరీలతో పాటు 2 సిక్సులు కూడా ఉన్నాయి. తాజా సెంచరీతో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ టెస్టు సెంచరీతో పుజారా టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో షమీ(6), బుమ్రా (0) ఉన్నారు.

1
43623
Story first published: Thursday, December 6, 2018, 15:26 [IST]
Other articles published on Dec 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+