ఆసీస్‌ను తక్కువ వేయొద్దు: టీమిండియానే ఫేవరేట్ అన్న కుంబ్లే

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరిస్ విజయం సాధించిన తర్వాత టీమిండియా మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వన్డే సిరిస్‌లో ఆతిథ్య జట్టుని తక్కువగా అంచనా వేయొద్దని మాజీ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. వన్డే సిరిస్ కోసం టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పాడు.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే శనివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలిచిన కోహ్లీసేనపై మరో బాధ్యత కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు బలహీనంగా ఉంది. అలాగని వారిని తేలిగ్గా తీసుకోలేం. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి" అని అన్నాడు.

తక్కువగా అంచనా వేస్తే
"వన్డేలకు ఇంకాస్త సమయం దొరికితే బాగుండేంది. అంతేకాకుండా క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకునే ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. అలాగని వారిని, వారి ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉందని తక్కువగా అంచనా వేస్తే మనం బలం కోల్పోయే ప్రమాదం ఉంది" అని కుంబ్లే పేర్కొన్నాడు.

భారత్‌పై ఆసీస్ మెరుగైన రికార్డు
50 ఓవర్ల ఫార్మాట్లో టీమిండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా రికార్డు 73-45తో మెరుగ్గా ఉంది. 2016లో చివరగా ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరిస్‌లో ఆస్ట్రేలియానే విజయం సాధించడం విశేషం. అయితే, ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు ఫార్మాట్లలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయడం కలిసొచ్చే అంశం.

ధోని ఫామ్‌పై కుంబ్లే
గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తోన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫామ్‌పై కూడా కుంబ్లే స్పందించాడు. "ధోని విషయంలో ఇప్పటికీ కొందరికి కొన్ని అనుమానాలున్నాయి. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన అతడి ప్రతిభను పూర్తిగా పక్కన పెట్టి మాట్లాడటం సరికాదు" అని కుంబ్లే చెప్పాడు.

వరల్డ్ కప్‌లో ధోని స్థానంపై
"ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ధోనికి తప్పక స్థానం ఉంటుందని అనుకుంటున్నా. ఇదే మాట కొద్ది రోజుల క్రితం చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నా. ధోని సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టిన ఘనత తనది. ధోని మీద విమర్శలు చేయడం మానుకుంటే మంచింది" అని కుంబ్లే అన్నాడు.

అందరి దృష్టిపైనే
ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత న్యూజిలాండ్ సిరిస్, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరిస్‌లలో రాణించి ధోని తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు భారత్ 13 వన్డేలు మాత్రమే ఆడనుండటంతో అందరి దృష్టి ధోనిపైనే ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications