తొలిటెస్టు: ఒంటిచేత్తో ఖవాజా క్యాచ్, నిరాశగా పెవిలియన్‌కు కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభమైంది. గురువారం అడిలైడ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 పరుగులకే ఔటై అభిమానులను నిరాశపరిచాడు.

ఖవాజా అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీ పెవిలియన్‌కు
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 11 ఓవర్ మూడో బంతికి కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. పాట్ కమిన్స్ వేసిన వైడ్ బాల్‌ను ఆఫ్‌సైడ్ బాదాడు.

ఈ క్రమంలో బౌండరీ వైపు దూసుకుపోతున్న బంతిని
ఈ క్రమంలో బౌండరీ వైపు దూసుకుపోతున్న బంతిని ఊహించనివిధంగా ఎడమవైపు డైవ్ చేసి ఉస్మాన్ ఖవాజా ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్‌కి విరాట్ కోహ్లీ సైతం అవాక్యయ్యాడు. దీంతో నిరాశగా విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. మైదానంలోని సహచరులంతా ఖవాజాను అభినందనలతో ముంచెత్తారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తొలి టెస్టు మొదటి సెషనల్‌లో ఉస్మాన్ ఖవాజా పట్టిన క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే టీ సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. లంచ్‌కి ముందే నాలుగు వికెట్స్ తీసిన ఆసీస్ బౌలర్లు లంచ్ తర్వాత రోహిత్ శర్మ (37), రిషబ్ పంత్ (25) పెవిలియన్‌కు చేర్చారు.

టీ విరామానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 143
ప్రస్తుతం క్రీజులో చతేశ్వర్ పుజారా (46 బ్యాటింగ్), అశ్విన్ (5 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్(2), మురళీ విజయ్(11) మరోసారి నిరాశ పరిచారు. ఆ తర్వాత కోహ్లీ(3), రహానే(13) తొందరగానే పెవిలియన్ చేరుకున్నారు. ఆసీస్ బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌కి రెండు, లియాన్‌కి రెండు, స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications