ఇండియా ఏతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజైన శుక్రవారం ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు సెంచరీలు సాధించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (25) ,రెన్ షా (11) పరుగుల వద్ద అవుటై నిరాశ పరిచినా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (107), షాన్ మార్ష్ (104) సెంచరీలు నమోదు చేశారు.
దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఇండియా ఎ బౌలర్లలో సైనీ 2, హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నారు. 55 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను స్మిత్, మార్ష్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించారు.
ఇండియా ఏతో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ
ఇండియా ఏతో జరగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతే చెలరేగాడు. 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను షాన్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే స్మిత్ సెంచరీ చేయగా, మార్ష్ అర్ధ సెంచరీ చేశాడు.
161 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 107 పరుగులు చేసిన అనంతరం స్మిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో తొలి రోజు టీ విరామానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (25), రెన్ షా (11) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్ సైని ఆదిలోనే ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. 8.4 ఓవర్ వద్ద 33 పరుగులకే వార్నర్‌ను అవుట్ చేసిన సైని ఆ తర్వాత 16.1వ ఓవర్ వద్ద రెన్‌షాను 11 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు.
లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 81/2
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇండియా ఏ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాండ్యా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు లంచ్ విరామానికి 24 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 31, షాన్ మార్ష్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇందులో టీమిండియా ఏ జట్టు రంగంలోకి దిగుతుండగా ఆస్ట్రేలియా మాత్రం పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. మరోవైపు భారత జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తాను పరీక్షించనుంది.
పరిమిత ఓవర్ల ఆటగాడిగా పేరున్న హార్దిక్ పాండ్యా ఈ మధ్య కాలంలో మెరుగ్గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణిస్తే ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల కోసం తుది జట్టుకు కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లి అతణ్ని పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. మరోవైపు హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి నాణ్యమైన బౌలర్ల బౌలింగ్‌లో తమను తాము పరీక్షించుకోవడానికి ఇండియా 'ఎ' ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం.
కాగా, జూనియర్ ప్రపంచకప్‌లో టీమిండియాకు నాయకత్వం వహించిన కిషన్‌ను ఈ మ్యాచ్‌కు వికెట్‌కీపర్‌గా ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్, అఖిల్ హెర్వాద్కర్ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. గత రంజీ సీజన్‌లో 1300పై పరుగులు చేసిన అయ్యర్ ఈసారి మాత్రం రాణించలేదు. ఇక ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ అంకిత బావ్నె మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగనున్నాడు.
జట్ల వివరాలు:
టీమిండియా: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అఖిల్ హెర్వడ్కర్, ప్రియాంక్ కీర్తి పంచల్, శ్రేయాస్ అయ్యర్, అంకిత్ బవ్నే, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సెహబాజ్ నదీమ్, క్రిష్ణప్ప గౌతమ్, కుల్దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, అశోక్ దిండా, మహ్మద్ సిరాజ్, రాహుల్ సింగ్, ఇంద్రజిత్.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్(కెప్టెన్). డేవిడ్ వార్నర్, అష్టోన్ అగర్, జాక్సన్ బర్డ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హజల్‌వుడ్, ఉస్మాన్ కవాజా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్, స్టీఫెన్ ఓకీఫ్, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్.