Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Australia vs India, 2019: 1st ODI - నమోదైన గణాంకాలివే

 Australia vs India, 2019: 1st ODI – Statistical Highlights

హైదరాబాద్: భారత్‌తో మూడు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేసింది.

దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. రోహిత్‌ శర్మ (133) అద్భుత సెంచరీ చేయగా, ధోనీ (51), భువనేశ్వర్‌ కుమార్‌ (29 నాటౌట్‌) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్‌ యువ పేసర్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జ్యే రిచర్డ్‌సన్‌ (4/26) కెరీర్‌లో సంచలన ప్రదర్శన చేశాడు.

మార్కస్ స్టోనియిస్, బెహ్రండార్ఫ్ చెరో రెండు... పీటర్ సిడ్డి‌ల్‌ ఒక వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు చేసిన సంగతి తెలసిందే.

ఈ మ్యాచ్‌లో నమోదైన గణాంకాలివే:

4 - ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్‌ శర్మ చేసిన సెంచరీలు. ఈ నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు వేదికలపై (138: మెల్‌బోర్న్‌లో 2015లో; 171 నాటౌట్‌: పెర్త్‌లో 2016లో; 124: బ్రిస్బేన్‌లో 2016లో; 133: సిడ్నీలో 2019) రావడం విశేషం. ఇలా చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే రోహిత్‌ సెంచరీలు చేసిన ఈ నాలుగుసార్లూ భారత్‌ ఓడిపోయింది. ఈ క్రమంలో వివ్‌ రిచర్డ్స్‌(మూడు సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు.

1
43627

1000 - ఈ గెలుపుతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్‌లో 1000వ విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఆస్ట్రేలియా ఇప్పటివరకు 1852 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 384, వన్డేల్లో 558, టి20ల్లో 58 విజయాలు సాధించింది.

7 - ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మకు ఇది ఏడో సెంచరీ. దీంతో సచిన్‌ టెండూల్కర్‌ (9 సెంచరీలు) తర్వాత కంగారూలపై అత్యధిక వన్డే సెంచరీలు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు.

10 - రోహిత్ శర్మ తాను ఆడిన గత 10 సిరీస్‌లలో కనీసం ఒక సెంచరీ అయినా చేశాడు.

9 - తొమ్మిదేళ్ల తర్వాత సిడిల్‌ ఆసీస్‌ తరఫున మళ్లీ వన్డే ఆడాడు. ఈ తొమ్మిదేళ్లలో ఆ జట్టు 169 వన్డేలు ఆడింది.

3 - భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీతో కలిసి రోహిత్‌ (22 సెంచరీలు) సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. సచిన్‌ (49), కోహ్లి (38) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

19 - వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న 19వ భారతీయ బౌలర్‌గా భువనేశ్వర్‌ కుమార్‌ నిలిచాడు.

Story first published: Sunday, January 13, 2019, 14:08 [IST]
Other articles published on Jan 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+