For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మయాంక్‍‌ను చులకనగా మాట్లాడిన కామెంటేటర్, నెటిజన్ల ఫైర్

India vs Australia: Why Mayank Agarwal And Ranji Trophy Insulted ?
Australia vs India 2018: Australian Commentator Makes Fun Of Mayank Agarwals First-Class Scores

మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా టీమిండియాలో ఓపెనర్‌గా అడుగుపెట్టిన మయాంక్ అగర్వాల్ మెల్‌బౌర్న్ వేదికగా టెస్టు టెస్ట్ అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్‌ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆడిన తొలి టెస్టులోనే తడబాటు లేకుండా ఆడి 76 పరుగుల వరకూ చేశాడు. దీంతో అతనిపై ఆశలు పెట్టుకుని జట్టులో స్థానం కల్పించినందుకు తగ్గ న్యాయమే చేశాడంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంచితే అరంగ్రేట క్రికెటర్ అనే చులకన భావంతో ఓ ఆస్ట్రేలియా కామెంటేటర్ అతనిని అవమానించాడు. గతంలో ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు ఆడిన 69 ఏళ్ల కెర్రీ ఓకీఫ్ అనే సీనియర్ కామెంటేటర్.. మయాంక్ గురించి మాట్లాడుతూ అతన్ని తక్కువగా పరిగణించాడు.

మయాంక్‌తో పాటు భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను కూడా

కేవలం మయాంక్‌నే కాదు అతనితోపాటు ఇండియా ఫస్ట్‌క్లాస్ క్రికెట్(రంజీ) గురించి కూడా తక్కువ భావంతో మాట్లాడాడు. షేన్‌వార్న్, మార్క్ హోవార్డ్‌లతో కలిసి ఫాక్స్ స్పోర్ట్స్ చానెల్‌కు ఓకీఫ్ కామెంటరీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మయాంక్ ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రస్తావించారు. దీనిపై ఓకీఫ్ స్పందిస్తూ.. అతడు క్యాంటీన్ సిబ్బంది లేదా వెయిటర్స్‌పై ఈ 304 పరుగులు చేసి ఉంటాడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

క్యాంటిన్ సభ్యులతో ట్రిపుల్ సెంచరీ

ఈ కామెంట్‌పై భారత అభిమానులు అతనిపై ధ్వజమెత్తారు. ఓకీఫ్‌పై ట్వీట్లతో తిట్ల వర్షం కురిపించారు. మయాంక్ అగర్వాల్ గతేడాది మహారాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. భారత జట్టు ఎంచుకోవడంలో ఈ ప్రదర్శన కూడా కీలకంగానే వ్యవహరించింది. అటువంటి ప్రాముఖ్యమైన ఇన్నింగ్స్ పట్ల చులకన భావంతో మాట్లాడటం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది.

భారత్‌లో 50 అంటే ఇక్కడ 40

ఈ లెక్కన భారత్ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని కూడా ఓకీఫ్ అవమానించినట్లేనని అభిమానులు మండిపడుతున్నారు. ఓ క్రికెట్ జర్నలిస్ట్ కూడా ఓకీఫ్ కామెంట్స్‌ను తప్పుబట్టారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో కామెంటరీ ఇస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా కూడా మయాంక్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 సగటు అంటే ఆస్ట్రేలియాలో 40 సగటు కిందికి వస్తుందని మార్క్ వా నోరుపారేసుకున్నాడు. విమర్శల దాడికి తట్టుకోలేక మరి కాసేపటికి తన ఉద్దేశ్యం అది కాదంటూ ట్విటర్‌లోనే వివరణ ఇచ్చుకున్నాడు.

1
43625
Story first published: Wednesday, December 26, 2018, 17:32 [IST]
Other articles published on Dec 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+