
మహమ్మద్ షమీ
అడిలైడ్ టెస్టులో భారత్ విజయం సాధించడంలో షమీది కీలకపాత్ర. విదేశీ పర్యటనల్లో భారత్ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేసే పేసర్లలో షమీ ఒకడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ను పరుగుల చేయకుండా కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. 235/8 వద్ద దూకుడుగా ఆడుతోన్న ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు చేర్చి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకే ఆలౌట్ చేశాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ మార్కస్ హారిస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత పీటర్ హ్యాండ్స్ కోంబ్ కీలక సమయంలో మిచెల్ స్టార్క్ వికెట్ తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన షమీ 123 పరుగులు సమర్పించుకున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆణిముత్యం జస్ప్రీత్ బుమ్రా. పరిమిత ఓవర్లలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో టెస్టుల్లో సైతం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. వైట్ బాల్ నుంచి రెడ్ బాల్‌కు తనని తాను మార్చుకున్న విధానం అద్భుతం. అడిలైడ్ టెస్టులో బుమ్రా 140కి స్పీడ్‌తో బంతులు సంధించాడు. అంతేకాదు ఈ టెస్టులో 6 వికెట్లు తీసిన బుమ్రా 115 పరుగులు సమర్పించుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్
గత విదేశీ పర్యటనల్లో పేలవ ప్రదర్శన చేస్తుండటంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, స్పిన్‌కు సహకరించే అడిలైడ్ పిచ్‌పై మాత్రం అశ్విన్ తనదైన శైలిలో దూసుకుపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోన్న జోష్ హెజెల్‌ఉడ్ వికెట్ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. హెజెల్‌ఉడ్ వికెట్ మ్యాచ్ విన్నింగ్ వికెట్ అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియాలో అడిలైడ్ టెస్టు ముందు వరకు సరైన గణాంకాలను నమోదు చేయని అశ్విన్ ఈ టెస్టులో మాత్రం ఆసీస్ గడ్డపై తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో అశ్విన్ 6 వికెట్లు తీసి 149 పరుగులు సమర్పించుకున్నాడు.

నాథన్ లయాన్
ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తన స్పిన్ బంతులతో ముప్పుతిప్పులు పెట్టాడు. లయాన్ ప్రదర్శనతోనే ఆస్ట్రేలియా జట్టు గెలుపు బరిలో నిలిచింది. అడిలైడ్ టెస్టులో ఇరు జట్లు కూడా నలుగురు బౌలర్లతో బరిలోకి దిగాయి. ఆస్ట్రేలియా జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ నాథన్ లియానే. ఈ టెస్టులో అటు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లో సైతం లయాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు తీసిన లయాన్ 205 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బిగ్ హిట్టర్స్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లను అలవోకగా పెవిలియన్‌కు చేర్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పేసర్లు తమ బంతులతో పిచ్‌ను గరుకుగా చేసిన తర్వాత బంతిని అందుకున్న లయాన్ చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో లయాన్ ఆరు వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












