For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టు ప్రదర్శన ఇదే.. రెండో టెస్టుకు ఎవరుంటారంటే...

Australia vs India 2018-19: Indias predicted playing XI for the second Test

న్యూ ఢిల్లీ: స్వల్ప ఆధిక్యం లభించినా ఇది భారత్‌కు ఘన విజయం. ఇప్పటివరకూ ఆసీస్ గడ్డపై అడుగుపెట్టి ఆడిన తొలి టెస్టులోనే విజయం సాధించడం చరిత్రలో ఇదే మొదటిసారి. డిసెంబరు 6 గురువారం నుంచి మొదలై ఐదు రోజుల పాటు జరిగిన తొలి టెస్టులో 31పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచిందిద టీమిండియా. అంతేకాదు దాంతో పాటు ఒకే ఏడాదిలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డపై మ్యాచ్‌ను గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

ఇరు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఉత్కంఠభరితంగానే సాగింది. సిరీస్‌లో భాగంగా ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో శుక్రవారం నుంచి మొదలుకానున్న రెండో టెస్టుకు పెర్త్ వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో దాదాపు ఈ పదకొండు మందే ఆడనున్నారా అనే అంచనాలు నెలకొన్నాయి.

మురళీ విజయ్.. కేఎల్ రాహుల్

మురళీ విజయ్.. కేఎల్ రాహుల్

తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా అవుటవడంతో రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్ల పాటు నిలదొక్కుకోగలిగారు ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్. వారిద్దరి భాగస్వామ్యంలో స్థిరంగా 60పరుగులు చేయగలిగారు. రెండో టెస్టులో పృథ్వీ షా ఆడితే మాత్రం వీరిద్దరిలో మినహాయింపు కనిపించేదేమో.. అయితే తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే పృథ్వీ షా రెండో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని టీమిండియా కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. దీంతో వారి స్థానాలు దాదాపు ఖాయమనే అనిపిస్తోంది.

చతేశ్వర్ పూజారా

చతేశ్వర్ పూజారా

రెండో టెస్టుకు జట్టులో ఆడటంలో ఏ మాత్రం సందేహం లేకుండా కనిపిస్తున్న ఆటగాడు చతేశ్వర్ పూజారా. అడిలైడ్‌లో చారిత్రక విజయం పొందేందుకు కీలక పాత్ర పోషించిన పూజారా తొలి ఇన్నింగ్స్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్రీజులో నిలబడి 82.5ఓవర్ల వరకూ ఆడగలిగాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీకి మించిన స్కోరు, రెండో ఇన్నింగ్స్‌లో 70కి పరుగులు చేయడంతో ఆసీస్ జట్టుకు 323పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీ:

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ గడ్డపై అడుగుపెట్టకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక 37పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో టెస్టులో కోహ్లీ ఆడటం ఖాయమే కానీ, అతని ప్రదర్శనపైనే అందరి ఆశలు కనిపిస్తున్నాయి.

అజింకా రహానె

అజింకా రహానె

విదేశీ గడ్డపై ఆడే జట్టుకు భరోసా కల్పించడంలో రహానె ముందుంటాడు. అలాంటిది రహానె తొలి ఇన్నింగ్స్‌లో 13పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి టీమిండియా కీలక స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు చాలా కాలం నుంచి ఆడుతోన్న రోహిత్ శర్మ టెస్టు జట్టులోకి అడుగుపెట్టింది ఈ తొలి టెస్టులోనే. హనుమ విహారీని పక్కకు పెట్టి స్థానం దక్కించుకున్న రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 37పరుగులు మాత్రమే చేయగలిగాడు. అప్పటికే విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేదని అనిపిస్తోంది. కేవలం ఒక్క పరుగుతో సరిపెట్టుకున్నాడు. దీంతో విహారీ జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

రిషబ్ పంత్

రిషబ్ పంత్

రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 25, 28 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌కు దిగిన పంత్ రెండు సార్లు వేగంగానే పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లోకి వెళ్లిపోయి బౌండరీలతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో పూజారాకు భాగస్వామ్యంగా నిలబడి 62 పరుగుల వరకూ రాబట్టగలిగారు.

ఇషాంత్ శర్మ.. మొహమ్మద్ షమీ.. జస్ప్రిత్ బుమ్రా

ఇషాంత్ శర్మ.. మొహమ్మద్ షమీ.. జస్ప్రిత్ బుమ్రా

బౌలర్లు ధీటుగా రాణించి 20వికెట్లు పడగొట్టారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే కితాబిచ్చాడు. ఇషాంత్ మ్యాచ్‌లో నో బాల్స్ వేసి నిరుత్సాహపరిచినప్పటికీ 3వికెట్లు తీశాడు. ఇక బుమ్రా 5 ఓవర్లు వేసి 24పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో తొలి టెస్టులో 9 వికట్లను రాబట్టాడు. వీరితో పాటుగా షమీ కూడా తన వంతు పాత్ర పోషించి ఐదు వికెట్లు తీశాడు.

1
43624
Story first published: Tuesday, December 11, 2018, 12:49 [IST]
Other articles published on Dec 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+