స్పిన్ బౌలింగ్‌లో ఇలా ఆడు: దినేశ్ కార్తీక్‌కు క్లాస్ పీకిన ధోని


హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో పేలవంగా వికెట్ చేజార్చుకున్న దినేశ్ కార్తీక్‌కి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోమవారం నెట్స్‌లో క్లాసీ పీకాడు. తొలి వన్డేలో 289 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగగా... ఓపెనర్ రోహిత్ శర్మ (133) ఫరవాలేదనిపించాడు.
ఒక ఎండ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించి దూకుడుగా ఆడుతున్న క్రమంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (12) బంతుల్ని వృథా చేయడంతో పాటు కనీసం స్ట్రైక్‌ని కూడా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా చివర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం పెరిగిపోయి... రోహిత్ శర్మ సైతం ఒత్తిడికి గురయ్యాడు.

34 పరుగుల తేడాతో భారత్ ఓటమి
దీంతో తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి వన్డేలో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లని ఎదుర్కోవడంలో దినేశ్ కార్తీక్ ఇబ్బందిపడటాన్ని గమనించిన ధోని.. రెండో వన్డేకి ముందు సోమవారం అడిలైడ్ స్టేడియం నెట్స్‌లో శిక్షణ ఇచ్చాడు. ధోని ఫుట్‌వర్క్‌తో పాటు స్టాన్స్ తీసుకునే విధానాన్ని దినేశ్ కార్తీక్ పరిశీలించాడు.
దినేశ్ కార్తీక్‌కి క్లాస్ పీకిన ధోని
అనంతరం దినేశ్ కార్తీక్ అదే తరహాలో స్పిన్ బౌలింగ్‌ని ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. సిడ్నీ వన్డేలో మహేంద్ర సింగ్ ధోని(51) హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో ధోని వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు.

ఐదో ఆటగాడిగా అరుదైన ఘనత
తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో 334వ వన్డే ఆడుతున్న ధోని భారత్ తరఫున 10వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,235) 10వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications