ఆస్ట్రేలియా Vs ఇండియా: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నమోదైన గణాంకాలివే


హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా ఈరోజు డ్రాగా ముగియగా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియా 7 టెస్టుల్లో విజయం సాధించింది.
తాజా టెస్టు సిరీస్ విజయంతో టీమిండియా అనేక గణాంకాలను నమోదు చేసింది. అవేంటో ఒక్కసారి చూద్దాం...

రెండో టెస్టు సిరిస్
2 - ఆసీస్ గడ్డపై ఒకటి లేదా అంతకుమించి టెస్టు మ్యాచ్‌లు జరిగిన సిరిస్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించిన రెండో టెస్టు సిరిస్ ఇది. అంతకముందు 1977-78 ఆసీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టుల్లో విజయం సాధించినప్పటికీ, టెస్టు సిరిస్‌ను మాత్రం నెగ్గలేకపోయింది.
4 - ఈ సిరిస్‌లో నాలుగు సార్లు 6-వికెట్ హాల్స్‌ను ఇరు జట్ల బౌలర్లు సాధించారు. నాథన్ లియాన్(6/122), మహమ్మద్ షమీ(6/33), బుమ్రా(6/33), కమ్మిన్స్(6/27)లు ఈ ఘనత సాధించారు. 2010/11 యాషెస్ సిరిస్ తర్వాత ఆసీస్ గడ్డపై నాలుగు సార్లు 6-వికెట్ హాల్స్ నమోదైన రెండో టెస్టు సిరిస్.
5 - ఈ సిరిస్‌లో నమోదైన వ్యక్తిగత సెంచరీల సంఖ్య. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా 3 సెంచరీలు సాధించగా, కోహ్లీ, పంత్ చెరోకటి నమోదు చేశారు. ఈ సిరిస్‌లో ఆతిథ్య జట్టుకు చెందిన ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ సాధించలేదు.

తొలి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్
20 - ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే పరుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉపఖండపు తొలి వికెట్ కీపర్‌గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు. ఇక, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ 16 క్యాచ్‌లు అందుకున్నాడు.
21 - ఈ టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లుగా జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లియన్ నిలిచారు. వీరిద్దరూ చెరో 21 వికెట్లు తీయడం విశేషం. ఓ టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా (21 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 1991/92 ఆసీస్ పర్యటనలో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) వికెట్లు తీశాడు. అయితే అది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కావడం విశేషం.
53 - ఈ సిరిస్‌లో ఆతిథ్య జట్టు ఇచ్చిన్ బైస్‌లు. సొంత గడ్డపై ఆస్ట్రేలియా బౌలర్లు ఇచ్చిన రెండో అత్యధిక స్కోరు ఇదే. 1950/51 యాషెస్ సిరిస్‌లో ఈ సంఖ్య 71గా ఉంది.

టిమ్ పైన్ ఖాతాలో చెత్త రికార్డు
174 - ఈ సిరిస్‌లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ టిమ్ పైన్ నమోదు చేసిన పరుగులు. సొంత గడ్డపై టీమిండియాతో జరిగిన ఓ టెస్టు సిరిస్‌లో ఆసీస్ కెప్టెన్ చేసిన తక్కువ పరుగులివే. 2003/04లో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో స్టీవ్ వా చేసిన 267 పరుగుల రికార్డుని టిమ్ పైన్ చెరిపేశాడు.
350 - ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన టెస్టు సిరిస్‌లో వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు ఇవి. 2013లో మహేంద్ర సింగ్ ధోని చేసిన 326 పరుగుల రికార్డుని తాజా సిరిస్‌లో రిషబ్ పంత్ చేరిపేశాడు.

521 పరుగులతో టాస్ స్కోరర్‌గా పుజారా
521 - ఈ సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఛటేశ్వర్ పుజారా నిలిచాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లాడిన పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో పుజారా తొలిసారి 500కుపైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
72 - 72 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై భారత్‌కు తొలి సిరీస్ విజయమిది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్ 7 సార్లు మాత్రమే విజయం సాధించింది.
4 - (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో భారత్ సిరీస్ విజయాలను నమోదు చేసింది. 1967/68లో న్యూజిల్యాండ్‌లో 3-1 తేడాతో... 1971లో ఇంగ్లాండ్‌లో 1-0 తేడాతో... 1986లో ఇంగ్లాండ్‌లో 2-0 తేడాతో.... 2007లో ఇంగ్లాండ్‌లో 1-0 తేడాతో.... 2008/09లో న్యూజిలాండ్‌లో 1-0 తేడాతో.... 2018-19లో ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో భారత్ సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications