Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ టాంపరింగ్‌ ఆరోపణలను ఖండించిన స్టీవ్ స్మిత్ (వీడియో)

Australia Vs England: Steve Smith rejects ball tampering talk

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 16 పరుగులతో విజయం సాధించిన ఇంగ్లండ్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ ను 3-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో బంతి అందుకున్న స్టీవ్ స్మిత్ తన పెదవులకు ఉన్న లిప్‌ బామ్‌ను బంతికి పూయడం మనం చూడొచ్చు.

దీంతో స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెటర్లు ఆరోపించారు. దీనిపై మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్మిత్ తనదైన శైలిలో స్పందించాడు. 'అలాంటిదేమీ లేదు. నా పెదవులకు ఉన్న లిప్‌బామ్‌ను బంతికి రాసినట్లు పలువురు నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఒకసారి వీడియోను పరిశీలిస్తే నా పెదవులపై లిప్‌ బామ్‌ లేదన్న విషయం అర్ధమవుతుంది' అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

మూడో వన్డేలో జోస్‌ బట్లర్‌ (83 బంతుల్లో 100 నాటౌట్‌), వోక్స్‌ (36 బంతుల్లో 53 నాటౌట్‌) అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 6 వికెట్లకు 302 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు మాత్రమే చేసింది.

కాగా, మూడో వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా స్మిత్‌ మ్యాచ్‌ ఫీజులో 40 శాతం, జట్టులోని మిగతా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం ఫీజును ఐసీసీ కోత విధించిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జనవరి 26న ఆడిలైడ్ వేదికగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 11:17 [IST]
Other articles published on Jan 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+