|
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(1), డేవిడ్ వార్నర్(2) పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పీటర్ హ్యాండ్స్ కోంబ్(3) సైతం తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.
|
ఆసీస్ బ్యాటింగ్ లైప్ ఆప్ విలవిల
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ-స్టీవ్ స్మిత్‌ల జోడీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 114 పరుగులు జోడించిన తర్వాత అలెక్స్ క్యారీ(46) హాఫ్ సెంచరీ ముంగిట అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ డౌకటయ్యాడు.
|
స్టీవ్ స్మిత్ మాత్రం నిలకడగా
ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ మాత్రం నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని సాధించాడు. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లను కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్(22), ప్యాట్ కమ్మిన్స్(6) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. చివర్లో బెహ్రండోర్ఫ్(1) నిరాశపరచగా... మిచెల్ స్టార్క్(29) ఫరవాలేదనిపించాడు.
|
చెలరేగిన క్రిస్ వోక్స్, అదిల్ రషీద్
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో స్టీవ్ స్మిత్ 119 బంతుల్లో 85 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా ఈ గౌరవప్రద స్కోర్ సాధించింది. మిగతా వారంతా ఆకట్టుకోలేకపోయారు. ఇక, ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు, మార్క్ వుడ్‌కు ఒక వికెట్ లభించింది.