సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. వరుస ఓటములతో ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న ఆ జట్టు నాలుగో టెస్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మ్యాచ్‌లో ఓటమి అంచుకు వెళ్లినప్పటికీ అప్పటికే చివరి రోజు ఆటలో సమయం ముగియడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. 388 పరుగుల లక్ష్యంతో నేడు ఉదయం 30-0 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ కాసేపటికే తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 46 పరుగులు వద్ద ఉండగా 9 పరుగులు చేసిన ఓపెనర్ హమీద్‌ను బోలాండ్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ జాక్ క్రాలీ కెరీర్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 74 పరుగుల స్కోర్ వద్ద 4 పరుగులు చేసిన మలాన్‌ను లియోన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 96 పరుగులు ఉన్నప్పుడు 77 (13 ఫోర్లు) పరుగులతో చెలరేగుతున్న ఓపెనర్ జాక్ క్రాలీని గ్రీన్ ఎల్బీడబ్య్లూగా ఔట్ చేశాడు.
అనంతరం నాలుగో వికెట్‌కు కెప్టెన్ జో రూట్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కలిసి 60 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 24 పరుగులు చేసిన రూట్‌ను బోలాండ్ ఔట్ చేశాడు. దీంతో బెయిర్‌స్టోతో కలిసి స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో స్టోక్స్ కెరీర్లో 24వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 193 పరుగుల వద్ద 60 పరుగులు చేసిన స్టోక్స్‌ను ఐదో వికెట్‌గా లియోన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 218 పరుగుల వద్ద ఉండగా 11 పరుగులు చేసిన బట్లర్‌ను, పరుగులేమి చేయని వుడ్‌ను ఒకే ఓవర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఎల్బీడబ్ల్యూల రూపంలో 6, 7 వికెట్లుగా ఫెమిలియన్ పంపాడు. జట్టు స్కోర్ 237 పరుగుల వద్డ ఉండగా 41 పరుగులు చేసిన బెయిర్‌స్టోను బోలాండ్ ఎనిమిదో వికెట్ రూపంలో ఔట్ చేశాడు.
ఇక ఇంగ్లండ్ ఓటమి ఖాయమనుకున్న సమయంలో జాక్ లీచ్, స్టూవర్ట్ బ్రాడ్ కాసేపు అడ్డుపడ్డారు. అయితే 34 బంతుల్లో 26 పరుగులు చేసిన లీచ్‌ను స్మిత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ బ్రాడ్, అండర్సన్ వికెట్ పడకుండా జాగ్రత్త పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ 270-9తో ఒక వికెట్ దూరంలో నిలిచి మ్యాచ్‌ను కాపాడుకుంది. తద్వారా ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లండ్ తొలి సారి ఓ మ్యాచ్‌లో ఓటమి తప్పించుకుంది. తొలి రోజు వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాకపోవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 3, కమిన్స్, లియాన్ రెండేసి, స్మిత్, గ్రీన్ తలో వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్ స్కోర్లు: ఆస్ట్రేలియా: 416-8 డిక్లేర్డ్, ఇంగ్లండ్: 294-10.
రెండో ఇన్నింగ్స్ స్కోర్లు: ఆస్ట్రేలియా:265-6 డిక్లేర్డ్, ఇంగ్లండ్: 270-9.