న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముష్ఫికర్‌ రహీమ్‌ అజేయ సెంచరీతో పోరాడినా.. ఆసీస్‌దే విజయం

ICC Cricket World Cup 2019: Australia Won By 48 Runs On Bangladesh | Match Highlights
Australia vs Bangladesh: David Warner ton leads Australia to 48-run win over Bangladesh at Cricket World Cup

గురువారం నాటింగ్‌హామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి జోరుమీదున్న ఆసీస్.. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 'హ్యాట్రిక్‌' విజయాన్ని అందుకుని సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. ఇక టోర్నీలో విజయాలు సాధిస్తూ అద్భుత ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ కూడా ఆసీస్‌పై బాగానే పోరాడింది. అయితే భారీ లక్ష్యం (382 పరుగులు) ముందుండడం.. బలమైన ఆసీస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొలేక విజయానికి కొద్ది దూరంలో నిలిచింది. ముష్ఫికర్ రహీమ్‌ అజేయ సెంచరీతో పోరాడినా బంగ్లాను గెలిపించలేకపోయాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రాణించిన షకీబ్‌:

రాణించిన షకీబ్‌:

382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాకు మంచి ఆరంభం లభించలేదు. నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (10)ను ఫించ్‌ రనౌట్‌ చేశాడు. సీనియర్లు తమీమ్ (62), షకీబ్‌ (41) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు 14 ఓవర్ల పాటు ఆసీస్‌ను దీటుగా ఎదుర్కొంటూ రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 19వ ఓవర్‌లో స్టొయినిస్‌.. షకీబ్‌ను అవుట్‌ చేశాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశలు పెట్టుకున్న బంగ్లాను అతడు నిరాశపరిచాడు.

 పోటీపడి ఆడారు:

పోటీపడి ఆడారు:

మరోవైపు 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తమీమ్‌ను అద్భుత బంతితో స్టార్క్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా కష్టాల్లో పడింది. లిటన్‌ దాస్‌ (20) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లాలు పోటీపడి దూకుడుగా ఆడారు. 54 బంతుల్లో ముష్ఫికర్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన మహ్ముదుల్లా 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్నాడు.

పోరాడినా ఓటమే:

పోరాడినా ఓటమే:

ఈ జోడి ధాటిగా ఆడుతూ 80 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. చివరి ఐదు ఓవర్లలో 82 పరుగులు కావాల్సి ఉండగా.. కూల్టర్‌ నైల్‌ 46వ ఓవర్‌లో వరుస బంతుల్లో మహ్ముదుల్లా (69; 50 బంతుల్లో 5×4, 3×6), షబ్బీర్‌ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో 95 బంతుల్లో ముష్ఫికర్‌ చేసిన సెంచరీ (102 నాటౌట్‌; 97 బంతుల్లో 9×4, 1×6) వృధా అయింది. స్టార్క్‌, కౌల్టర్‌నైల్‌, స్టాయినిస్‌లు తల రెండు వికెట్లు తీశారు.

 వార్నర్‌ మెరుపులు:

వార్నర్‌ మెరుపులు:

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 121 పరుగులు జత చేసింది. ఫించ్‌ ఔట్ అయినా వార్నర్‌ తగ్గలేదు. అతనికి ఖవాజా (72 బంతుల్లో 89; 10 ఫోర్లు) కూడా తోడవడంతో ఆసీస్ స్కోర్ పరుగులు పెట్టింది. 110 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్న వార్నర్‌.. మరింత చెలరేగాడు. ఈ క్రమంలో 139 బంతుల్లో 150 పరుగుల మైలురాయి అందుకున్న వార్నర్‌.. భారీ షాట్‌ కొట్టబోయి వెనుదిరిగాడు. చివర్లో మాక్స్‌వెల్‌ (32; 10 బంతుల్లో 2×4, 3×6) విరుచుకుపడడంతో ఆసీస్ 381 పరుగులు చేసింది.

Story first published: Friday, June 21, 2019, 8:28 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X