ఒక మ్యాచ్‌లో 714 పరుగులు: ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి

హైదరాబాద్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగుల సంఖ్య 714. ఫలితంగా ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 381 పరుగులు చేశారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... ఉస్మాన్ ఖవాజా (72 బంతుల్లో 89; 10 ఫోర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.

రెండో అత్యధిక స్కోరు
దీంతో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం సాధించి 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

ముష్ఫికర్ రహీమ్ సెంచరీ
బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికర్ రహీమ్ (97 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (62; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (50 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రెండు సెంచరీలు సాధించిన వార్నర్
ఈ ప్రపంచకప్‌లో వార్నర్ ఇప్పటివరకు చేసిన పరుగులు 89*, 3, 56, 107, 26, 166. విండీస్‌తో మ్యాచ్‌లో మినహా మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. ఆఫ్ఘన్‌తో పోరులో తొలి వికెట్‌కు ఆరోన్ ఫించ్‌తో కలిసి 96 పరుగులు జోడించిన వార్నర్, భారత్‌పై 61 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.

తొలి వికెట్‌కు 121 పరుగులు
ఇక, పాకిస్థాన్‌పై సెంచరీ (107) నమోదు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. శ్రీలంకపై 26 పరుగులే చేసినా.. తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు కెప్టెన్‌తో కలిసి 121 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications