For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs AFG Pitch Report: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య డూ ఆర్ డై మ్యాచ్.. పరుగుల వరద పారనుందా?

AUS vs AFG Pitch Report: ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ చేరుకోవడానికి ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. గెలిచిన జట్టు నేరుగా సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఈ రెండు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది.

గడాఫీ స్టేడియంలో పరుగుల వరద పారనుందా?
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ అధిక స్కోరింగ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లు , స్పిన్నర్లకు పెద్దగా సహకరించదు. ఈ క్రమంలో మరోసారి పిచ్ పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఇంగ్లాండ్, ఆసీస్ జట్లు తలపడిన మ్యాచ్ లో 350 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్లు 300 కంటే ఎక్కువ స్కోరును సాధించాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ లో మళ్లీ 300 కంటే అధిక స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Australia vs Afghanistan Match pitch report for the crucial Champions Trophy 2025

ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ 4 వన్డేలలో ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇటీవల 2023 ప్రపంచ కప్ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించడానికి చాలా దగ్గరగా వచ్చింది.. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత డబుల్ సెంచరీ వారి నుంచి ఈ అవకాశాన్ని చేజారేలా చేసింది. అయితే ఆఫ్ఘన్ జట్టును తక్కువగా అంచనా వేయలేం. ఇంగ్లాండ్ పై గెలుపుతో ఊపు మీదున్న ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియాను కూడా కట్టడి చేయాలని భావిస్తోంది.

Take a Poll

ఇరు జట్లు ఇవే..

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(wk), రహ్మత్ షా, అష్మతుల్లా షాహిది (c), సెదికుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్, గుల్బదిన్ నాయిబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, నూర్ అహ్మద్

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్(c), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

Story first published: Thursday, February 27, 2025, 14:27 [IST]
Other articles published on Feb 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+