Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్‌ప్రీత్ బుమ్రా లెఫ్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది?

Australia Victorias Nic Maddinson imitates Jasprit Bumrahs action with left arm

క్యాన్‌బెర్రా: భారత క్రికెట్ జట్టు బౌలింగ్ బ్యాక్ బోన్.. జస్‌ప్రీత్ బుమ్రా. ఐపీఎల్ అందించిన స్టార్ బౌలర్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. బంతిని సంధించడంలో అతనిది ఓ ప్రత్యేకమైన స్టైల్. ఇదివరకు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ, దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్.. వీరందరూ తోటి బౌలర్ల కంటే డిఫరెంట్‌గా బంతులను సంధించడంలో దిట్ట. బుమ్రా మినహా మిగిలిన ఆ ఇద్దరూ రిటైర్డ్ అయ్యారు. బుమ్రా కేరీర్ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది.

యార్కర్ల స్పెషలిస్ట్.. డెత్ ఓవర్లలో బ్యాటర్లను దిగ్బధించేయగల జస్‌ప్రీత్ బుమ్రా కుడిచేతి వాటం బౌలర్. అతను గనక ఎడమ చేత్తో బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ అచ్చంగా బుమ్రా బౌలింగ్ వేసినట్టే బంతులను సంధించాడు. విక్టోరియా టీమ్ తరఫున ఆడే ఈ ప్లేయర్ ఆల్‌రౌండర్. బ్యాటింగ్ అతని ప్రధాన బలం. జట్టు తరఫున ఇన్నింగ్‌ను ఆరంభిస్తుంటాడు. పార్ట్ టైమ్ బౌలర్.

అతని పేరు నికొలస్ జేమ్స్ మ్యాడిన్సన్.. అందరూ నిక్ మ్యాడిన్సన్‌గా పిలుస్తుంటారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అప్పుడప్పుడు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడాక్స్ బౌలింగ్ వేస్తుంటాడు. షెఫ్పీల్డ్ షీల్డ్ 2021-022 ఫైనల్ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేసిన తీరు ఆకట్టుకుంది. వెస్టర్న్ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అతను జస్‌ప్రీత్ బుమ్రా శైలిలో బౌలింగ్ చేశాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాటర్ ఆరోన్ హార్డీకి డిఫరెంట్‌గా బంతులను సంధించాడు.

మ్యాడిన్సన్ బౌలింగ్‌కు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. రౌండ్ ద వికెట్ తీసుకుంటూ.. అచ్చం బుమ్రాలాగే రనప్ చేయడం, అతని లాగే చేతులను చాచి బంతులను వేయడం కనిపించింది. ఇది ఫైనల్ మ్యాచ్. డ్రాగా ముగిసింది. డ్రా కావడం ఖాయమని తేలడంతో మ్యాడిన్సన్ ఇలా సరదాగా బుమ్రాను అనుకరించాడు.

Story first published: Monday, April 4, 2022, 13:27 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+