Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

0/0కు డిక్లేర్ చేస్తాం: ఆసిస్ ప్రతిపాదనకు విండీస్ నో

సిడ్నీ: ఆస్ట్రేలియా - వెస్టిండీస్ మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్... విండీస్‌కు ఓ ప్రతిపాదన చేశాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండానే డిక్లేర్ చేస్తుందని, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్సులో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడుతామని స్టీవ్ స్మిత్ ప్రతిపాదించాడు.

టెస్టుల్లో ఓ జట్టు 0/0 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడం మనం ఎప్పుడూ చూడలేదనే చెప్పవచ్చు. కానీ స్టీవ్ స్మిత్ తొలి ఇన్నింగ్స్ ఆడకుండానే జీరోకు డిక్లేర్ చేస్తామని ప్రత్యర్థి కెప్టెన్‌కు ప్రతిపాదించాడు.

Australia v West Indies: Steve Smith's declaration offer rejected by tourists in drawn SCG Test

టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను తిరిగి నెం.1 జట్టుగా నిలపాలని పట్టుదలగా ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తొలి నాలుగు రోజుల్లో కేవలం 86.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన మ్యాచ్‌లో కనీసం ఒక్క ఇన్నింగ్స్‌ అయినా పూర్తవని మ్యాచ్‌లో ఎలాగైనా ఫలితం రాబట్టేందుకు ప్రయత్నించాడు.

కానీ తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయి వైట్‌వాష్‌ ముంగిట ఉన్న వెస్టిండీస్‌ సాహసించకపోవడంతో అతడి ఆలోచనకు తెరపడింది. విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ ముందు తన ప్రతిపాదనను స్టీవ్ స్మిత్ ఉంచగా... హోల్డర్ అంగీకరించలేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+