For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతి'తెలివైన స్టంపౌట్, వివాదం: ఔటై మనసులు గెలిచాడు

కొలంబో: ఆస్ట్రేలియా - శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓ స్టంపౌట్ వివాదానికి, చర్చకు దారి తీసింది. టెస్టులో నాలుగో రోజు (మంగళవారం) ఆస్ట్రేలియా వికెట్ కీపర్ శ్రీలంక బ్యాట్సుమెన్‌ను రెప్పపాటులో ఔట్ చేశాడు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నాలుగో రోజు 22/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక జట్టులోని ఓపెనర్‌ కరుణ రత్నె స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ బౌలింగ్‌ చేసిన ఆస్ట్రేలియా స్పిన్నర్‌ లియాన్‌ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్‌ చేసేందుకు కరుణరత్నె ప్రయత్నించాడు.

కానీ బంతి అతను వూహించని రీతిలో టర్న్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ పీటర్‌ నెవిల్‌ చేతుల్లోకి వెళ్లింది. నిరాశ చెందిన కరుణరత్నె ఆ బంతిని ఎలా ఆడిండాల్సిందో ఓసారి రిహార్సల్స్ చేశాడు. ఆ సమయంలో అతను తనకు తెలియకుండానే క్రీజులోని తన పాదాన్ని గాలిలోకి లేపాడు.

Australia v Sri Lanka third Test: Gilchrist backs nifty Peter Nevill stumping

మొదటి నుంచి అతని పాదాల కదలికలను నిశితంగా గమనిస్తున్న కీపర్‌ నెవిల్‌ అదే అదునుగా భావించి బంతితో వికెట్లను కొట్టాడు. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకులతో పాటు బ్యాట్స్‌మెన్‌కు, దగ్గరగా ఫీల్డింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకి ఏం జరిగిందో అర్థం కాలేదు.

ఈ స్టంపౌట్‌ను అంపైర్లు మూడో అంపైర్‌కు నివేదించారు. వీడియోను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ కరుణరత్నె ఔట్‌గా ప్రకటించాడు. ఈ స్టంపౌట్‌ను అడమ్ గిల్ క్రిస్ట్ సమర్థించాడు.

కాగా, ఆసీస్‌ కీపర్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ కొందరు సామాజిక మీడియాలో మండిపడుతున్నారు. మరికొందరు అది వికెట్‌ కీపర్‌ తెలివితేటలు అంటున్నారు. అయితే బ్యాట్స్‌మెన్‌ కరుణరత్నె మాత్రం ఆసీస్‌ ఆటగాళ్లపై ఎలాంటి అసహనం ప్రదర్శించకుండా గౌరవంగా పెవిలియన్‌‌కు వెళ్లి, అందరి మనసులు గెలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+