ఫోటోలు: తొలి టీ20లో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక థ్రిల్లింగ్ విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. విజయం దక్కాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో కపుగెదెర ఫోర్ కొట్టడంతో శ్రీలంక గెలిచింది.
దీంతో మూడు టీ20ల సిరిస్‌లో 1-0తో శ్రీలంక ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ 43, క్లింగర్ 38 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో లతీష్ మలింగ రెండు వికెట్లు తీశాడు.

ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ
అనంతరం 169 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఓవర్లోనే తరంగ (0) వికెట్ కోల్పోయిన లంకను మునవీర (44), డిక్వెలా (30) ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో శ్రీలంక 91/3తో కష్టాల్లో పడింది.

గుణరత్నే, సిరివర్ధన అవుట్: మలుపు తిరిగిన మ్యాచ్
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన గుణరత్నే 37 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి జట్టుని విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో గుణరత్నే, సిరివర్ధన (15) ఒకే ఓవర్లో అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.

చివరి ఓవర్‌లో 6 పరుగులు
ఆఖరి ఓవర్లో శ్రీలంక గెలవాలంటే ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో తొలి నాలుగు బంతులకు మూడు పరుగులే రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ స్థితిలో ఐదో బంతికి రెండు పరుగులు చేసిన కపుగెదెర (10 నాటౌట్) చివరి బంతికి ఫోర్ కొట్టి లంకను గెలిపించాడు.

ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20
దీంతో శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో విజయాన్ని నమోదు చేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications