సిడ్నీ: భారత్ - ఆస్ట్రేలియా అయిదో వన్డేలో విరాట్ కోహ్లీ కొట్టిన ఫోర్‌ను స్పైడర్ కెమెరా ఆపింది! క్రికెట్ కవరేజీ కోసం ఈ మధ్య మైదానాల్లో స్పైడర్ కెమెరాను వినిగియోస్తున్నారు. వాటిని సిడ్నీ క్రికెట్ మైదానంలో అమర్చారు.
అయిదో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లి.. హేస్టింగ్స్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే అప్పర్ కట్ ఆడాడు. దాదాపు బౌండరీ అవతల పడేలా కనిపించిన బంతి మధ్యలో స్పైడర్ కెమెరాకు తాకింది. అయినా బౌండరీకి వెళ్లింది. ఐతే అంపైర్ దీన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. కాగా, దీనిపై కెప్టెన్ ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అయిదో వన్డేలో గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడుతూ... ఈ రోజు మనీష్ పాండే ఆడిన ఇన్నింగ్స్ అతడికి మరో 10-15 మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తుందని చెప్పాడు. ప్రస్తుతానికి అయిదో స్థానంలో అతడు సరైనవాడిలా కనబడుతున్నాడన్నాడు. అరంగేట్ర మ్యాచ్ అయినా బూమ్రా చక్కగా బౌలింగ్ చేశాడని, అలాంటి బౌలర్లే కోసమే మేం వెతుకుతున్నామన్నాడు.