పెర్త్‌లో రెండో టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 326 ఆలౌట్


హైదరాబాద్: పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి భారత్ ఆలౌట్ చేసింది. మొదటి రోజు బౌన్సీ పిచ్‌ను అంతగా సద్వినియోగం చేసుకోలేక భారత బౌలర్లు.. రెండో రోజు పుంజుకోవడంతో ఆసీస్ టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.

ఓవర్‌నైట్ స్కోరు 277/6తో తొలి ఇన్నింగ్స్
ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 277/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియాకు పైన్-కమిన్స్ జోడీ శుభారంభం ఇచ్చింది. వీళ్లిద్దరూ వికెట్ పడకుండా ఆడుతూనే స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ ఏడో వికెట్‌కు 59 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు.

వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్
దీంతో జట్టు స్కోరు కూడా 300 మార్కును దాటింది. అయితే, ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జట్టు స్కోరు 310 వద్ద పాట్ కమిన్స్(19)ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. తర్వాత ఓవర్‌లోనే టిమ్ పైన్(38)ని జస్ప్రీత్ బుమ్రా ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్క్( 6), హాజిల్‌వుడ్ (0) వరుస బంతుల్లో ఇషాంత్ పెవిలియన్‌కు చేర్చాడు.

108.3 ఓవర్లలో 326 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 108.3 ఓవర్లలో 326 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్‌మన్లలో హ్యారీస్ (70), ట్రావిస్ హెడ్(58), ఆరోన్ ఫించ్(50) హాఫ్ సెంచరీలతో చెలరేగగా... షాన్ మార్ష్(45), టిమ్ పైన్ 38 పరుగులతో రాణించారు. మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా, రెండో రోజు 49 పరుగులకి మిగతా వికెట్స్‌ని కోల్పోయింది.
నాలుగు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ
భారత బౌలర్స్‌లో ఇషాంత్‌కి నాలుగు వికెట్స్ పడగొట్టగా... బుమ్రా, ఉమేష్ యాదవ్, విహారీ చెరో రెండు వికెట్స్ తీశారు. ఆసీస్ బౌలర్లను తట్టుకుని భారత బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేస్తే ఈ టెస్ట్ కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అడిలైడ్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications