For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా మూడో సారి విజయాన్ని ఎగరేసుకుపోయిన ఇంగ్లాండ్

Australia v England, third ODI – as it happened

హైదరాబాద్: ఐదు రోజుల వన్డేలో భాగంగా మూడో వన్డేలో సిడ్నీ వేదికగా క్రికెట్ దిగ్గజ జట్లు రెండూ తలపడ్డాయి. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులకు జరిగిన హోరాహోరీ సమరంలో 16పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ సమరంలో ఓవర్లు ముగియడంతో ఆస్ట్రేలియా 286/6 స్కోరుతో చాలించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ 302 స్కోరును చేసింది.

ఆసీస్‌ లక్ష్యం 303
ఇంగ్లండ్‌ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాస్‌ బట్లర్‌(100 నాటౌట్‌; 83 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకం సాధించడంతో పాటు క్రిస్‌ వోక్స్‌(53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్‌ మూడొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఈ ఇద్దరూ 113 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 107 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. జాసన్‌ రాయ్‌(19), హేల్స్‌(1), బెయిర్‌ స్టో(39), జో రూట్‌(27) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌-బట్లర్‌లు మరమ్మత్తులు చేపట్టారు. అయితే మోర్గాన్‌(41) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత వోక్స్‌-బట్లర్‌ జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలోనే ముందుగా వోక్స్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, బట్లర్‌ సెంచరీ నమోదు చేశాడు. దాంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.

మోర్గాన్ వన్డే పరుగుల రికార్డు:
మోర్గాన్‌(41) హాఫ్‌ సెంచరీకి చేరువలో పెవిలియన్‌ చేరాడు. అయినా ఇంగ్లాండ్ తరపున అత్యధిక వన్డే పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా మోర్గాన్‌ నిలిచాడు. ఇప్పటివరకూ వన్డే కెరీర్‌లో మోర్గాన్‌ సాధించిన పరుగులు 5,120. దాంతో ఇంగ్లిష్‌ క్రికెట్‌ జట్టు తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో మోర్గాన్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో ఇయాన్‌ బెల్‌(5,416) కొనసాగుతున్నాడు.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో ఆడిన ఇంగ్లండ్‌ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాస్‌ బట్లర్‌(100 నాటౌట్‌; 83 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకం సాధించడంతో పాటు క్రిస్‌ వోక్స్‌(53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్‌ మూడొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఈ ఇద్దరూ 113 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 21, 2018, 17:19 [IST]
Other articles published on Jan 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+