న్యూజిలాండ్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు ఆస్ట్రేలియా టీ20, వన్డే మహిళల అండర్-19 జట్లను గురువారం ప్రకటించింది. అయితే ఈ జట్టులో భారత సంతతికి చెందిన అమ్మాయిలే ముగ్గురు ఉన్నారు. రిబ్యా స్యాన్, సమారా దుల్విన్, హస్రత్ గిల్.. టీ20, వన్డే రెండు ఫార్మాట్లకు ఎంపికయ్యారు. హస్రత్ గిల్ బ్యాటర్ కాగా సమారా దుల్విన్ బౌలర్, రిబ్యా స్యాన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
అయితే ఈ ముగ్గురు ఎంపిక గురించి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఓ ప్రకటన విడుదుల చేసింది. ''వాళ్ల చేరిక.. ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెరుగుతున్న వైవిధ్యాన్ని, భారతీయ వారసత్వంతో ఆటగాళ్ల గణనీయమైన సహకారాన్ని ప్రతిబింబిస్తుంది'' అని సీఏ పేర్కొంది. వన్డే, టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ ట్రైసిరీస్ బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.

14 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ జరగనుంది. టీ20 సిరీస్‌లో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ముక్కోణపు సిరీస్‌లో ఓ జట్టు ఇతర జట్లతో రెండు సార్లు తలపడతాయి. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఉన్నాయి. ప్రతి జట్టు ఇతర జట్టుతో ఓ సారి పోటీపడనుంది. కాగా, ఆసీస్ అండర్-19 జట్టుకు ఆ దేశ మాజీ ప్లేయర్ క్రిస్టెన్ బీమ్స్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియా అండర్-19 మహిళల టీ20 జట్టు: బోనీ బెర్రీ, కయోమ్హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, సమారా దుల్విన్, లూసీ ఫిన్, హస్రత్ గిల్, లూసీ హామిల్టన్, అమీ హంటర్, లారోసా, మెక్‌కీన్, రిబ్యా, టెగాన్, ఎలిజబెత్ వర్త్లీ, హేలీ.
ఆస్ట్రేలియా అండర్-19 మహిళల వన్డే జట్టు: బోనీ బెర్రీ, కయోమ్హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, సమారా డల్విన్, లూసీ ఫిన్, హస్రత్ గిల్, అమీ హంటర్, ఎలియనోర్ లారోసా, మెక్‌కీన్, జూలియట్ మోర్టన్, రిబ్యా, టెగాన్, ఎలిజబెత్ వర్త్లీ, హేలీ.