
2021కి టీ20 సిరిస్ వాయిదా
ఆ టీ20 సిరిస్ కూడా 2021కి వాయిదా పడింది. "తొలుత ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరిస్‌కు అక్టోబర్‌లో ఆతిథ్యమివ్వాలని భావించాం. అయితే, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పుడు మూడు టీ20 సిరిస్ ఆడేందుకు ముందుకొచ్చింది. అది కూడా ఇండియా ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ టీ20కి ముందు. ఈ సిరిస్‌పై తేదీని ఇంకా ఖరారు చేయలేదు" అని అక్రమ్ చెప్పారు.

నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా
యాషెస్ సిరిస్‌తో ప్రారంభమైన ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక, బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియాతో జరగనున్న టెస్టు సిరిస్‌తో తన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించనుంది. కాగా, ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ 2-2తో సమం అయిన సంగతి తెలిసిందే.

స్మిత్ అనేక రికార్డులు
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో వరుసగా ఆరు సార్లు 80కిపైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సర్ ఎవర్టన్ వీక్స్ తర్వాత టెస్టుల్లో వరుసగా 80కిపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

స్మిత్ చేసిన పరుగులు 761
ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ స్కోర్లు 144, 142, 92, 211, 82, 80 ఇలా ఉన్నాయి. ఈ ఆరు ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ చేసిన పరుగులు 761. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైనా.. స్మిత్ ఈ పరుగులు చేయడం విశేషం.


Click it and Unblock the Notifications
