Australia tour of India 2019: గాయం కారణంగా మిచెల్ స్టార్క్ దూరం


హైదరాబాద్: ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత పర్యటనకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గాయపడిన స్టార్క్ భారత పర్యటనకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. మిచెల్ స్టార్క్ స్థానంలో కేన్ రిచర్డ్స్‌సన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
భారత పర్యటన ఒక వార్మప్‌లాగా
ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా మాట్లాడుతూ ఇంగ్లాండ్‌లో జరగబోయే ప్రపంచకప్‌కు భారత పర్యటన తమ ఆటగాళ్లకు ఒక వార్మప్‌లాగా ఉపయోగపడుతుందని వెల్లడించింది. 15 మంది సభ్యుల జట్టును సెలెక్టర్ ట్రివర్ హోన్స్ ప్రకటించారు. మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఇప్పటికే టీమ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

బలహీనపడిన ఆసీస్ బౌలింగ్ దళం
తాజాగా స్టార్క్ కూడా జట్టులో లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ దళం బలహీన పడింది. కాగా, ఫిబ్రవరి 24 నుంచి 13 మార్చి వరకు ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2 టి20లు, 5 వన్డేలు జరుగనున్నాయి.

భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆష్టాన్ టర్నర్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ కారే, పాట్ కమిన్స్, నాథన్ కల్టర్ నీలే, జ్యే రిచర్డ్స్‌సన్, కనే రిచర్డ్స్‌సన్,, జాసన్ బహ్రెండార్ఫ్, నాథన్ లయన్, ఆడమ్ జంపా, డీయార్సీ షార్ట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications