న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ ఏడాది అక్టోబర్‌లో 11వ ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్‌

Australia to host 11th Indoor Cricket World Cup in October

హైదరాబాద్: 11వ ఎడిషన్ ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 10 నుంచి 17 వరకు జరగనుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను మెల్ బోర్న్‌లోని కాసే స్టేడియం, సిటీ పవర్ సెంటర్‌లలో నిర్వహించనున్నట్లు వరల్డ్ ఇండోర్ క్రికెట్ ఫెడరేషన్ ప్రకటించింది.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. టోర్నమెంట్ యొక్క 25ఏళ్ల చరిత్రలో ఏదో ఒక విభాగంలో ప్రపంచకప్‌ను ఎప్పుడూ కోల్పోకుండా ఆస్ట్రేలియా ప్రయత్నిస్తుంది. చివరగా 2017లో జరిగిన ఈ టోర్నీకి దుబాయి ఆతిథ్యమిచ్చింది.

'డుప్లెసిస్ ఇంకా రిటైర్ కాలేదు, జట్టు ప్రణాళికలో ఇంకా ఉన్నాడు''డుప్లెసిస్ ఇంకా రిటైర్ కాలేదు, జట్టు ప్రణాళికలో ఇంకా ఉన్నాడు'

ఈ టోర్నమెంట్‌లో 10 విభాగాల నుండి క్రికెటర్లు నాలుగు విభాగాలలో పోటీపడతారు: అండర్-21 పురుషులు, మహిళలు, ఓపెన్ పురుషులు, మహిళలు. ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్‌ నిర్వహణ‌పై క్రికెట్ ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెలిందా క్లార్క్ మీడియాతో మాట్లాడారు.

"2020 ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్య దేశంగా పురుషుల మరియు మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్లుగా ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లను స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నాం. ఈ టోర్నీ ఇండోర్ జట్లకు సెంటర్ స్టేజ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్మాట్‌లో ఆట యొక్క ఉత్సాహం, నైపుణ్యాన్ని చూపించడానికి ఒక గొప్ప అవకాశం" అని తెలిపారు.

ఝార్ఖండ్‌లో ధోనీ ప్రత్యేక పూజలు.. రీఎంట్రీ కోసమేనా?!!ఝార్ఖండ్‌లో ధోనీ ప్రత్యేక పూజలు.. రీఎంట్రీ కోసమేనా?!!

జూన్ 27 నుండి జూలై 11 వరకు కాసే స్టేడియంలో జరిగే ఇండోర్ క్రికెట్ జాతీయ ఛాంపియన్‌షిప్ తరువాత 2020 ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టుని ఎంపిక చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జరిగే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఆస్ట్రేలియానే ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 22, 2020, 15:00 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X