వరల్డ్ కప్: కివీస్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం

లక్ష్య చేధనను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు హెడెన్ 39 బంతుల్లో, వాట్సన్ 52 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. వీరిద్దరి భాగస్వామ్యంలో 18.1 ఒవర్‌కు 133 పరుగులు వచ్చాయి. అయితే ఇదే ఓవర్‌లో హెడెన్, వాట్సన్‌లిద్దరూ 2 బంతుల తేడాతో పెవిలియన్ చేరారు. ఆ తరువాత వచ్చిన పాంటింగ్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 16 పరుగులు చేసి అవుటయ్యాడు.క్లార్క్, వైట్ సునాయసంగా విజయ లక్ష్యాన్ని చిన్నది చేశారు. క్లార్క్, వైట్‌ల భాగస్వామ్యంలో 44 బంతుల్లో 40 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 7 వికెట్ల విజయాన్ని అందించారు.
న్యూజిల్యాండ్ ఆది నుంచి పరుగుల వేటలో తడబడింది. పటిష్ట ఆస్ట్రేలియా బౌలింగ్‌కు తలవంచింది. మొదటి పది ఓవర్లలో 49 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. రెండో పవర్ ప్లే తీసుకున్న ఆస్ట్రేలియా 5 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. మూడో పవర్ ప్లేను తీసుకున్న న్యూజిల్యాండ్ 5 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో రెండు వికెట్లను కోల్పోయింది. మెక్లమ్(52), వెటోరీ (44) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు (ఫ్రాంక్లిన్, స్త్టెరిస్) డకవుట్ అయ్యారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications