
కార్లో దొంగతనం
కరోనా కారణంగా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న టిమ్ పైన్.. తన గ్యారేజీని ఇండోర్ జిమ్‌లా మార్చుకున్నాడు. ఇందుకోసం గ్యారేజీలోని కారును బయటకి తీసుకువచ్చాడు. అయితే సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఉంచిన వ్యాలెట్‌ను దొంగలించారు. తన క్రెడిట్‌కార్డు ఉపయోగించినట్లు మెసేజ్ కూడా వచ్చిందని టిమ్ తెలిపాడు. కారులోని వ్యాలెట్‌లో చాలా క్రెడిట్‌కార్డులు ఉన్నాయని చెప్పాడు.

నిద్రలేవగానే షాక్‌కు గురయ్యా
'ఈ రోజు ఉదయం నిద్రలేవగానే షాక్‌కు గురయ్యా. క్రెడిట్కాార్డును వినియోగించినట్టు వచ్చిన మెసేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. నా గ్యారేజీని ఇండోర్ జిమ్ లాగా మార్చుకునేందుకు కారును వీధిలోకి తరలించా. బయట ఉన్న కారు వద్దకు వెళ్లి చూస్తే డోర్ తెరుచుకొని ఉంది. నా వాలెట్ పోయింది. క్రెడిట్‌కార్డు ఉపయోగించినట్లు మెసేజ్ కూడా వచ్చింది' అని టిమ్ ఆసీస్ మీడియా ఎస్ఈఎన్తో చెప్పాడు.

టిమ్ కెప్టెన్సీపై అనుమానాలు
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో అన్ని క్రీడా ఈవెంట్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే టిమ్ ఆసీస్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉందనే వార్తలు ఎక్కువయ్యాయి. మాజీలు సైతం స్టీవ్‌కు పగ్గాలు అప్పగించాలని అంటున్నారు. మరోవైపు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై కూడా వేటు పడేట్లు ఉంది.

స్మిత్ కెప్టెన్సీ నిషేధం పూర్తి
2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా అప్పటి కెప్టెన్ స్మిత్ బాల్‌టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బాల్‌టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు ఆటకు, రెండేళ్లు కెప్టెన్సీకి స్మిత్ దూరమయ్యాడు. ఏడాది పాటు ఆటకు దూరమైన స్మిత్ గతేడాది తిరిగి జట్టులోకి రాగా.. ఆదివారం కెప్టెన్సీ నిషేధ కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో స్మిత్ త్వరలోనే మళ్లీ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












