రిటైర్‌మెంట్ వార్తలపై స్పందించిన ఆసీస్ కెప్టెన్ ఫించ్

టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిరాశ పరిచింది. కచ్చితంగా ఫైనల్ చేరే జట్లలో ఆసీస్ ఉంటుందని టోర్నీ ముందు చాలా మంది నిపుణులు అంచనా వేశారు. వాటన్నింటినీ తలకిందులు చేసిన ఆస్ట్రేలియా జట్టు.. సెమీస్ కూడా చేరలేదు. దీంతో ఆ జట్టు సారధి ఆరోన్ ఫించ్.. క్రికెట్ నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి.

బిగ్‌బాష్ లీగ్ తర్వాత ఆలోచిస్తా..
త్వరలోనే క్రికెట్‌కు ఫించ్ గుడ్‌బై చెప్పేస్తాడని ఆస్ట్రేలియన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన ఫించ్.. ఈ విషయంపై ప్రస్తుతం తను ఆలోచించడం లేదని చెప్పాడు. ముందుగా తాను ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ లీగ్ బిగ్‌బాష్‌లో ఆడతానని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తానని చెప్పాడు. ప్రస్తుతానికైతే తను ఇంకా క్రికెట్ ఆడటాన్ని, ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు.

ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన..
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోనే ఘోరపరాజయం చవిచూసింది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను ఎదుర్కొని, ఏకంగా 89 పరుగుల తేడాతో మట్టికరిచింది.
ఆ తర్వాత టోర్నీ మొత్తం ఈ భారీ ఓటమి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికే సరిపోయింది. చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. చివరకు నెట్ రన్ రేట్ కారణంగానే సెమీస్ రేసు నుంచి ఆసీస్ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి.

వన్డేలకు వీడ్కోలు చెప్పేసిన ఫించ్
పొట్టి ఫార్మాట్‌పై ఫోకస్ పెంచాలని అనుకున్న ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో ఫించ్ ఆడిన సందర్భాలే తక్కువ కాగా.. టీ20, వన్డే ఫార్మాట్లలో కొనసాగాడు. 2018లో ఆ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టి.. గతేడాది తమ దేశానికి తొలి టీ20 ప్రపంచకప్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications