తొలి ఓవర్‌లోనే 0, 4, 0, 4, 0, 4తో
సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌తో ఆస్ట్రేలియా జట్టులోకి పునరాగమం చేసిన మార్నస్‌కి తొలి ఓవర్‌లోనే 0, 4, 0, 4, 0, 4తో పుజారా స్వాగతం పలికాడు. అప్పటి వరకూ 132 బంతుల్లో 4 ఫోర్లు మాత్రమే కొట్టిన పుజారా.. ఆ ఓవర్‌లో కేవలం 6 బంతుల వ్యవధిలోనే 3 ఫోర్లు కొట్టడం కొసమెరుపు. పుజారా (82 బ్యాటింగ్: 178 బంతుల్లో 10ఫోర్లు) జోరుతో భారత్ 65 ఓవర్లు ముగిసే సమయానికి 211/3తో మెరుగైన స్కోరు దిశగా దూసుకెళ్లింది.

ఒత్తిడికి గురై పరుగులు సమర్పించుకున్న మార్నస్
భారత్ జట్టు మరో ఓవర్‌లో టీ విరామానికి వెళ్తుందనగా.. కెప్టెన్ టిమ్‌పైన్.. మార్నస్ చేతికి బంతినిచ్చాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 2 టెస్టులే ఆడిన మార్నస్.. గురువారం వేసిన తొలి ఓవర్‌లోనే కాస్తంత ఒత్తిడికి గురై పరుగులు సమర్పించుకున్నాడు. అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకున్న పూజారా.. అతడి బంతుల్ని వరుస విరామాలతో బౌండరీకి తరలించేశాడు. దీంతో.. అప్పటి వరకూ 132 బంతుల్లో 49 పరుగులతో సాగిన పుజారా ఇన్నింగ్స్‌కి ఒక్కసారిగా ఊపు వచ్చింది.

134 హాఫ్, మరో 65కి సెంచరీ
అంతేకాకుండా.. పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి.. మరో 65 బంతుల్లో వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో చతేశ్వర్ పూజారా(130), హనుమ విహారీ(39)లతో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్.. తొలి రోజు బౌలర్లు
ఈ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు వరకూ మిచెల్ స్టార్క్ కేవలం 18 ఓవర్లు మాత్రమే వేసి 75 పరుగులు సమర్పించుకోగా, నాథన్ లయన్ మాత్రం 29 ఓవర్లకు 88 పరుగులిచ్చాడు. వీరిలా ఉంటే అత్యధిక ఎకానమీ రేటు సాధించిన బౌలర్‌గా మార్నస్ నిలిచాడు. నాలుగు ఓవర్లలో 25పరుగులిచ్చాడు.


Click it and Unblock the Notifications













