Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీఫైనల్ విషయంలో గందరగోళం.. భారత్ వల్ల ఆ రెండు జట్లకు తీవ్ర ఇబ్బంది!

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సెమీఫైనల్ విషయంలో ఓ గందరగోళం చోటు చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు ప్రయాణ తిప్పలు ఏర్పడ్డాయి.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?
దుబాయ్ వేదికగా తొలి సెమీ ఫైన‌ల్ మంగళవారం (మార్చి 4) నిర్వహించనున్నారు. రెండో సెమీ ఫైనల్ బుధవారం (మార్చి 5) లాహోర్ వేదికగా జరగనుంది. అయితే తొలి సెమీస్ కు టీమిండియా అర్హ‌త సాధించినప్పటికీ.. ఆ పోరులో భారత్ ప్రత్యర్థి (ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా) ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఆదివారం (మార్చి 2) జ‌రిగే భారత్ - న్యూజిలాండ్ ఫలితం తర్వాతే దీనిపై స్ప‌ష్ట‌త రానుంది.

Australia South Africa Face Tight Travel situation for Champions Trophy 2025 semifinal venue for Teamindia

దుబాయ్ కు ఆసీస్, సౌతాఫ్రికా..
తాజాగా అందిన సమాచారం ప్రకారం గ్రూప్ బీలో సెమీస్ చేరిన ఆసీస్, సౌతాఫ్రికా శనివారం దుబాయ్ కు చేరుకున్నాయి. కానీ ఈ రెండు జట్లతో ఒకటి.. ఆదివారం కివీస్ - భారత్ మ్యాచ్ ఫలితం రాగానే తిరిగి పాకిస్థాన్ కు వెళ్లనుంది. అందుకు కారణం మార్చి 2న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ కు.. మార్చి 4న జరిగే తొలి సెమీస్ కు ఒక్క రోజే గ్యాప్ ఉండటం.

భారత్ గెలిస్తే... సౌతాఫ్రికా వెనక్కి..
ఆదివారం (మార్చి 2) మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. తొలి సెమీస్ లో గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడాల్సి వస్తుంది. దీంతో ఆసీస్ పాకిస్థాన్ కు తిరిగి వెళ్లకుండా.. దుబాయ్ లోనే ఉండిపోతుంది. కానీ అప్పుడు గ్రూప్ బీలో మొదటి స్థానంలో ఉన్న సౌతాఫ్రికా మాత్రం మార్చి 5న పాకిస్థాన్ లాహోర్ వేదికగా జరిగే రెండో సెమీస్ కోసం తిరిగి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

భారత్ ఓడితే.. ఆసీస్ వెనక్కి..
అదే ఆదివారం (మార్చి 2) మ్యాచ్ లో భారత్ ఓడిపోతే.. తొలి సెమీస్ లో గ్రూప్ బీలో మొదటి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో పోటీపడాల్సి వస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా పాకిస్థాన్ కు తిరిగి వెళ్లకుండా దుబాయ్ లోనే ఉండిపోతుంది. కానీ గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాత్రం.. మార్చి 5న పాకిస్థాన్ లాహోర్ వేదికగా జరిగే రెండో సెమీస్ కోసం తిరిగి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

అలా ప్రస్తుతం (శనివారం రోజు) దుబాయ్ చేరుకున్న ఆసీస్, సౌతాఫ్రికా జట్లతో ఏదో ఒకటి మళ్లీ తిరిగి వెంటనే (ఆదివారం మ్యాచ్ ముగిశాక) ఒక్క రోజు గ్యాప్ లో... పాకిస్థాన్ కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ రెండు జట్లకు టైట్ ట్రావెలింగ్ షెడ్యూల్ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు.. టోర్నీ నిర్వాహ‌కుల తెలివి త‌క్కువ త‌నం వ‌ల్లే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు ప్రయాణ కష్టాలను ఎదుర్కొంటున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

Story first published: Sunday, March 2, 2025, 9:00 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+