Ashes 2021: బోలాండ్ ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్.. సిరీస్ ఆసీస్ సొంతం

మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లను గెలుచుకోని సిరీస్‌లో అధిక్యంలో కొనసాగుతున్న కంగారులు తాజాగా మూడో టెస్టులోనూ ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించారు. బాక్సింగ్ డే సందర్భంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది.
రెండున్నర రోజుల లోపే ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్‌ను అతిథ్య ఆస్ట్రేలియా వన్ సైడెడ్‌గా ముగించింది. మ్యాచ్ మొత్తంలో ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేపోయిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ ధాటికి 68 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయం పాలైంది.

కుప్పకూలిన ఇంగ్లండ్
ఈ మ్యాచ్‌లో 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన జాక్ క్రాలేను, పరుగులేమి చేయనీయకుండా డేవిడ్ మలాన్‌ను మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆ కాసేపటికే 7 పరుగులు చేసిన ఓపెనర్ హసీబ్ హమీద్‌ను, పరుగులేమి చేయనీయకుండా జాక్‌లీచ్‌ను బోలాండ్ ఒకే ఓవర్‌లో ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఆ జట్టు 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ జోరూట్, బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు.
కానీ జట్టు స్కోర్ 46 పరుగుల వద్ద ఉండగా.. 11 పరుగులు చేసిన స్టోక్స్‌ను స్టార్క్ ఐదో వికెట్‌గా ఫెమిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే 60 పరుగుల వద్ద 5 పరుగులు చేసిన బెయిర్‌స్టోను, 61 పరుగుల వద్ద 28 పరుగులు చేసిన కెప్టెన్ జోరూట్‌ను ఔట్ చేసిన బోలాండ్ ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. రూట్ ఔటవడంతో 61 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఇక కోలుకోలేకపోయింది. ఆ జట్టు ఓడిపోవడానికి ఇక ఎంతోసేపు పట్టలేదు. 65 పరుగుల వద్ద మార్క్ వుడ్, ఓలి రాబిన్సన్‌ను డకౌట్‌ల రూపంలో ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు బోలాండ్.
చివరగా 68 పరుగుల వద్ద 2 పరుగులు చేసిన అండర్సన్‌ను గ్రీన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 14 పరుగల తేడాతో ఘోర పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌట్ అవడం ద్వారా ఇంగ్లండ్ తమ టెస్ట్ కెరీర్‌లోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. అంతేకాకుండా సమిష్టి బ్యాటింగ్ వైఫల్యంతో 82 పరుగులు కూడా చేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 27.4 ఓవర్లే బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6, స్టార్క్ 3, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు. స్కోర్లు: తొలి ఇన్నింగ్స్- ఇంగ్లండ్:185-10, ఆస్ట్రేలియా: 267-10. సెకండ్ ఇన్నింగ్స్-ఇంగ్లండ్: 68-10.

బోలాండ్ సిక్సర్
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ చెలరేగాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఓవర్లే బౌలింగ్ చేసిన బోలాండ్ 7 పరుగుల మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. బోలాండ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. దీంతో తొలి మ్యాచ్‌లోనే ఈ గణాంకాలు సాధించిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఒక వికెట్ పడగొట్టిన బోలాండ్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు ఖాతాలో వేసుకోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా అతిథ్య ఆస్ట్రేలియా 5 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జనవరి 5 నుంచి సిడ్నీలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications