న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓ మ్యాచ్ గెలిచింది!!

Australia snap losing streak and level ODI series with South Africa

హైదరాబాద్: వన్డే ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు ఓ గెలుపు. ఏడు వరుస ఓటముల తర్వాత ఉత్కంఠను అధిగమించి ఓ విజయం. శుక్రవా రం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా పర్యటనని ఘన విజయంతో ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు.. రెండో మ్యాచ్‌లో గెలుపు ముంగిట బోల్తాపడింది.

 రబాడ 4 పడగొట్టగా.. ప్రిటోరియస్ 3 వికెట్లతో

రబాడ 4 పడగొట్టగా.. ప్రిటోరియస్ 3 వికెట్లతో

మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ అరోన్ ఫించ్ (41: 63 బంతుల్లో 4ఫోర్లు), క్రిస్‌లిన్ (44: 44 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు), అలెక్స్ కారీ (47: 72 బంతుల్లో 4ఫోర్లు) ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 48.3 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిటోరియస్ 3 వికెట్లు తీశాడు.

187 వద్ద మిల్లర్ ఔటవడంతో

187 వద్ద మిల్లర్ ఔటవడంతో

స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా జట్టు 14.4 ఓవర్లు ముగిసే సమయానికే డికాక్ (9), మకరమ్ (16), హెండ్రిక్స్ (19), హెన్రిచ్ (14) వికెట్లు కోల్పోయి 68/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్ (47: 65 బంతుల్లో 3ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (51: 71 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు) నిలకడగా ఆడటంతో.. ఆ జట్టు కోలుకునేలా కనిపించింది. కానీ.. జట్టు స్కోరు 187 వద్ద మిల్లర్ ఔటవడంతో.. ఒత్తిడిలో పడిన దక్షిణాఫ్రికా ఆఖరికి 224/9కే పరిమితమైంది.

 దక్షిణాఫ్రికాకు 20 పరుగులు అవసరమవగా..

దక్షిణాఫ్రికాకు 20 పరుగులు అవసరమవగా..

ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయానికి 20 పరుగులు అవసరంకాగా.. స్పిన్నర్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో తాహిర్ రెండు ఫోర్లు బాదినా.. ఆఖరికి 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆస్ట్రేలియా జట్టులో స్టాయినిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టొయినిస్‌ (3/35), స్టార్క్‌ (2/51), హాజల్‌వుడ్‌ (2/42) ప్రత్యర్థిని దెబ్బతీశారు.

 మూడో మ్యాచ్‌ ఆదివారం హోబర్ట్‌లో

మూడో మ్యాచ్‌ ఆదివారం హోబర్ట్‌లో

గత ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ని ఓడించిన సఫారీ జట్టు.. శుక్రవారం అడిలైడ్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో 7 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. మూడో వన్డేల ఈ సిరీస్ 1-1తో సమమవగా.. ఆఖరి వన్డే మూడో మ్యాచ్‌ ఆదివారం హోబర్ట్‌లో జరుగుతుంది.

Story first published: Saturday, November 10, 2018, 11:37 [IST]
Other articles published on Nov 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X