ఘోర పరాజయంతో దిగజారిన ఆస్ట్రేలియా

న్యూ ఢిల్లీ: పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ రెండు స్థానాల్ని చేజార్చుకుంది. అబుదాబి వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టెస్టులో 373 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలి టెస్టుని అతికష్టం మీద డ్రాగా ముగించి ఊపిరి పీల్చుకున్న ఆసీస్.. రెండో టెస్టులో మాత్రం కనీస పోరాట పటిమను కూడా చూపలేకపోయింది.

373 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా
రెండో టెస్టులో పాకిస్తాన్ చక్కటి పోరాట పటిమను ప్రదర్శించింది. ఈ క్రమంలో ఇరు జట్ల స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి. తొలిఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 282 చేయగా ఆస్ట్రేలియా 50.4ఓవర్లకే 145పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి పాకిస్థాన్ 400/9 డిక్లేర్‌గా ప్రకటించింది. చేధనకు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ఆరోన్ పించ్ మాత్రమే పరవాలేదనే ప్రదర్శన చేశాడు. ఇక జట్టు 164 పరుగులకే ఆలౌట్ అయి భారీ పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఆస్ట్రేలియా 14 పాయింట్లను చేజార్చుకుని
ఈ టెస్టు సిరీస్ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దీంతో ఘోర వైఫల్యంతో సిరీస్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా 14 పాయింట్లను చేజార్చుకుని మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. సిరీస్ ఆరంభానికి ముందు ఆ జట్టు ఖాతాలో 116 పాయింట్లు ఉండగా.. ప్రస్తుతం అవి 102కి తగ్గిపోయాయి.

ర్యాంక్‌లో పాకిస్థాన్ ఎలాంటి మార్పు లేదు
మరోవైపు సిరీస్‌ని 1-0తో దక్కించుకున్న పాకిస్థాన్ ర్యాంక్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సిరీస్‌ని 88 పాయింట్లతో ప్రారంభించిన పాక్ ఖాతాలో ప్రస్తుతం 7 పాయింట్లు చేరినా.. 95 పాయింట్లతో ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితమైంది. మరో రెండు పాయింట్లు సాధించి ఉంటే.. ఆ జట్టు శ్రీలంక (97)ని వెనక్కి నెట్టేది. అంటే..తొలి టెస్టులో గెలిచి ఉంటే పాక్ ఆరో స్థానానికి ఎగబాకేదన్నమాట.

116 పాయింట్లతో నెం.1 స్థానాన్ని భారత్..
వెస్టిండీస్‌ని ఇటీవల 2-0తో చిత్తుగా ఓడించిన భారత్ జట్టు 116 పాయింట్లతో నెం.1 స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (106), ఇంగ్లాండ్ (105), న్యూజిలాండ్ (102), ఆస్ట్రేలియా (102) టాప్-5లో ఉన్నాయి. ప్రస్తుతం విండీస్ జట్టుతో స్వదేశంలోనే పోరాడుతున్న టీమిండియా నవంబరు 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications