న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ర్యాంకింగ్స్‌లో దిగజారిన ఆస్ట్రేలియా, 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

Australia slip to 34-year low in ICC ODI rankings

హైదరాబాద్: ఒకప్పుడు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా.. కొంతకాలంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందనే చెప్పాలి. బాల్‌ టాంపరింగ్ వివాదంలో యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఆసీస్‌ ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. దాదాపు ఏడాది వ్యవధిలో 15 వన్డేలు ఆడిన ఆసీస్‌ 13 మ్యాచ్‌లలో ఓటమి పాలైందంటే ఆ జట్టు క్రమంగా ఎంతగా దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు.

Australia slip to 34-year low in ICC ODI rankings

ప్రస్తుతం ఆసీస్‌-ఇంగ్లాండ్‌ మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. తొలి రెండు వన్డేల్లో ఆసీస్‌ పరాజయం పాలైంది. దీంతో ఆసీస్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడే. 2017లో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించిన ఆసీస్‌.. ఆపై వరుసగా మూడు ద్వైపాక్షిక సిరీస్‌లను చేజార్చుకుంది. 34 ఏళ్లలో ఆసీస్‌ ఆరో ర్యాంకుకు దిగజారిపోవడం ఇదే మొదటిసారి.

న్యూజిలాండ్‌, భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లతో వరుసగా

న్యూజిలాండ్‌, భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లతో వరుసగా

న్యూజిలాండ్‌, భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లతో వరుసగా జరిగిన మూడు సిరీస్‌లను ఆసీస్‌ కోల్పోయింది. మరొకవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించడం కూడా ఆసీస్‌ ఎదుర్కొంటున్న కష్ట సమయానికి ఉదాహరణగా చెప్పొచ్చు.

జట్టు ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకుంది

జట్టు ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకుంది

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు పరాజయం ఎదురుకావడంతో ఆ జట్టు ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ఆరో స్థానానికి పడిపోయింది. ఫలితంగా 34 ఏళ్ల తర్వాత తొలిసారి వన్డేల్లో ఆరో స్థానానికి ఆసీస్‌ పరిమితమైంది. చివరిసారి 1984 జనవరిలో ఆసీస్‌ ఆరో స్థానంలో నిలిచింది.

 ఆపై ఇంతకాలానికి అదే స్థానానికి

ఆపై ఇంతకాలానికి అదే స్థానానికి

ఆసీస్‌ ఇలానే ఆరో స్థానంలో నిలవగా, ఆపై ఇంతకాలానికి అదే స్థానానికి పరిమితమైంది. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్‌(124) అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌(122), దక్షిణాఫ్రికా(113), న్యూజిలాండ్‌(112) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టాప్ 1లో కొనసాగుతన్నా:

టాప్ 1లో కొనసాగుతన్నా:

ప్రస్తుతం పాకిస్థాన్‌, ఆసీస్‌ 102 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో ఇంకా ఆడాల్సిన మూడు వన్డేల్లో ఏ ఒక్కటి గెలిచినా ఆసీస్‌ ర్యాంకు కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. మ్యాచ్‌ గెలిస్తే వచ్చే పాయింట్లతో పాక్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి ఎగబాకనుంది.

Story first published: Tuesday, June 19, 2018, 13:56 [IST]
Other articles published on Jun 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X