Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్ధిక్ పాండ్యా అవుట్: ఆసీస్‌తో చివరి టెస్టులకు అదే జట్టు

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరగబోయే మిగతా రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు తుది జట్టులో చోటు దక్కని ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను జట్టు నుంచి విడుదల చేశారు. గాయంతో ఇబ్బంది పడుతున్న పాండ్యాను తప్పించిన సెలెక్షన్‌ కమిటీ చివరి రెండు టెస్టులకు అదే జట్టును కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో పాండ్యాను విడుదల చేయడంతో టీమిండియా జట్టు సభ్యుల సంఖ్య 16 నుంచి 15కి తగ్గింది. పాండ్యా విజయ్‌ హజారె ట్రోఫీలో బరోడా తరఫున క్వార్ట ర్‌ఫైనల్లో ఆడనున్నాడు. మరోవైపు పూణె టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడి రెండో టెస్టు ఆడలేకపోయిన ఓపెనర్‌ మురళీ విజయ్‌ను జట్టుతో పాటే ఉంచారు.

Australia series: Hardik Pandya out of India Test squad for last 2 Tests

మూడో టెస్టుకు వరకు అతడు కోలుకోగలడని టీమ్‌ మేనేజిమెంట్‌ భావిస్తోంది. మార్చి 16 నుంచి రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్ల చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్‌ 1-1తేడాతో సమమైంది. గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన రోహిత్ శర్మ, షమి కోలుకున్నప్పటికీ వారిని ఎంపిక చేయలేదు.

ఆసీస్‌తో మిగతా రెండు టెస్టులకు భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ, మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, కరుణ్‌నాయర్‌, అశ్విన్‌, జడేజా, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, జయంత్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అభినవ్‌ ముకుంద్‌.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+