న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దినేశ్ కార్తీక్‌ని కాదని రిషబ్ పంత్ ఎందుకు?: ఎమ్మెస్కే వివరణ ఇదీ

India vs Australia: Dinesh Karthik Was Not Selected For ODI's | Oneindia Telugu
Australia series a chance for Rishabh Pant to pip Dinesh Karthik in World Cup team? MSK Prasad reveals

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు వన్డేలు, టీ20ల్లో అవకాశం కల్పించిన సెలెక్టర్లు దినేశ్ కార్తీక్‌కు మాత్రం పొట్టి ఫార్మాట్లోనే అవకాశమిచ్చారు. వన్డేల్లో పంత్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అయితే, దినేశ్ కార్తీక్ మాత్రం ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. గత ఏడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు.

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్: ఫైనల్లో సింధు vs సైనాజాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్: ఫైనల్లో సింధు vs సైనా

వరల్డ్ కప్‌కి ముందు జరుగుతున్న చివరి సిరీస్‌

వరల్డ్ కప్‌కి ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ కావడం.. దినేశ్ కార్తీక్‌కు చోటు ఇవ్వకపోవడంతో అతడు వరల్డ్ కప్‌లో ఆడటం అనుమానంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్‌కు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. స్కూల్ పిల్లల్లాగా ఈ పాలిటిక్స్ ఏంటని నిలదీస్తున్నారు.

కేఎల్ రాహుల్, కార్తీక్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారు?

కేఎల్ రాహుల్, కార్తీక్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారని అడిగితే దాదాపు అందరూ కార్తీక్ వైపే మొగ్గు చూపుతారు. ఏడాది కాలంగా కార్తీక్ నిలకడగా ఆడుతున్నాడని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... కార్తీక్‌ను తప్పించి, దేని ఆధారంగా రాహుల్‌‌కు చోటిచ్చారని చెప్పాలంటూ మరొక నెటిజన్ డిమాండ్ చేశాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

ఇక, జట్టు ప్రకటన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో కార్తీక్‌కు అవకాశం కల్పించాం. సొంత గడ్డ మీద ఆసీస్‌తో సిరీస్‌లో పంత్‌కు ఛాన్సిస్తున్నాం. వీరి ప్రదర్శనను అంచనా వేసి వరల్డ్ కప్ ముందు నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పడం కొసమెరుపు.

Story first published: Saturday, February 16, 2019, 11:54 [IST]
Other articles published on Feb 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X