ఆస్ట్రేలియా సంచలనం.. 6.5 ఓవర్లలో ముగిసిన వన్డే!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 6.5 ఓవర్లలోనే 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, ఈ మ్యాచ్ అరుదైన రికార్డు నమోదుచేసింది. వన్డే చరిత్రలో తక్కువ బంతుల్లో ఫలితం తేలిన ఆరో మ్యాచ్‌గా ఈ పోరు రికార్డులకెక్కింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటవ్వగా ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 6.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్ 186 బంతుల్లో ఫలితం తేలింది. కాగా, తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్‌ల జాబితాలో నేపాల్ vs యూఎస్ఏ (104 బంతులు), శ్రీలంక vs జింబాబ్వే (120 బంతులు), శ్రీలంక vs భారత్ (123 బంతులు), కెనడా vs శ్రీలంక (140 బంతులు), జింబాబ్వే vs శ్రీలంక (164 బంతులు) టాప్-5లో ఉన్నాయి.

1985లో భారత్ vs ఇంగ్లండ్ వన్డే ఫలితం 180 బంతుల్లోనే తేలింది. కానీ ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. దీంతో ఇది రికార్డుగా పరిగణించలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు బెంబేలెత్తించారు. 24.1 ఓవర్లలోనే 86 పరుగులకు ఆలౌట్ చేశారు. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ అథెంజె (32; 60 బంతుల్లో), రోస్టన్ ఛేజ్ (12; 26 బంతుల్లో), కీసీ కార్టీ (10; 22 బంతుల్లో) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగిలిన ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేదు.

ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ నాలుగు వికెట్లు, లాన్స్ మోరిస్, జంపా చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనకు వచ్చిన ఆస్ట్రేలియా టీ20 తరహాలో బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ (41; 18 బంతుల్లో), జోష్ ఇంగ్లిస్ (35*; 16 బంతుల్లో) విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆరోన్ (2; 5 బంతుల్లో) నిరాశపరిచాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (6*; 3 బంతుల్లో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డేల్లో ఈ మ్యాచే అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications