Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్: ఇంగ్లాండ్‌‌పై మళ్లీ ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా

Australia seal 4-0 Ashes series win against England

హైదరాబాద్: ప్రతిష్టాత్మక్ యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ 4-0తో కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగులతో విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఇంగ్లాండ్‌ క్లీన్ స్లీప్ నుంచి బయటపడింది. దీంతో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను కంగారూల జట్టు 4-0తో దక్కించుకుంది.

నాలుగో టెస్ట్ డ్రా అనంతరం భారీ అంచనాలతో ఇంగ్లాండ్ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆఖరు టెస్టు అయిన ఐదో టెస్ట్‌లో టాస్‌ గెలిచింది. మొదట స్కోరు భారీ స్థాయిలో చేయాలని అంచనాలతో ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ గెలుచుకుంది. కానీ, ఆసీస్ బౌలర్ కమిన్స్‌ ధాటికి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు.

దీంతో ఆ జట్టు 346 పరుగులకే చేతులెత్తేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 649/7 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌‌ను మరోసారి కమిన్స్‌ చిత్తు చేశాడు. తన బౌలింగ్ ధాటికి 180 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగులతో ఘన విజయం సాధించింది.

ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు డేవిడ్‌ వార్నర్‌(56), కవాజా(171), స్మిత్‌(83), షాన్‌ మార్ష్‌(156), మిచెల్‌ మార్ష్‌(101) రాణించారు. ఇంగ్లాండ్‌ను కప్పకూల్చిన కమిన్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు విజయాలను అందించిన స్మిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అందుకున్నాడు.

5 మ్యాచుల సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకోవడంతో ఆసీస్‌ 104 పాయింట్లతో తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకింది. మరో పక్క ఇంగ్లాండ్‌ ఐదో స్థానానికి పడిపోయింది. 124 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 11:32 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+