భారత బౌలర్‌ను కావాలనే ఢీ కొట్టాడు: ఆసీస్ క్రికెటర్ ఖాతాలో 2 డీమెరిట్ పాయింట్లు

హైదరాబాద్: ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ ఫన్నింగ్ రెండు డీమెరిట్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో మంగళవారం జేబీ మార్క్స్ ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో 31వ ఓవర్‌ని భారత యువ బౌలర్ ఆకాశ్ సింగ్ వేశాడు. అప్పుడు క్రీజులో సామ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, తొలి బంతికి పరుగు తీసే క్రమంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా తన మోచేతిని భారత బౌలర్ ఆకాశ్ సింగ్‌కు తగిలించాడు. దీంతో అతడు ఐసీసీ నియమావళి ప్రకారం లెవెల్-1 తప్పిదానికి పాల్పడ్డాడు.
నిబంధన ప్రకారం సామ్ ఫన్నింగ్ రూల్ 2.2ను అతిక్రమించినట్లు ఐసీసీ సైతం ధ్రువీకరించింది. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం రిఫరీ ముందు సామ్ ఫన్నింగ్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను జత చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫన్నింగ్(75) పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో భారత యువ జట్టు 74 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. సఫారీ గడ్డపై జరుగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications