2013 పర్యటన అంత అధ్వాన్నంగా ఉండదు: వాట్సన్
హైదరాబాద్: ఫిబ్రవరిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో 2013 పర్యటన అంత అధ్వాన్నంగా అయితే ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. 2013లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా 4-0తో వైట్ వాష్‌కు గురైంది.
అంతేకాదు ఆ పర్యటనలో క్రమశిక్షణ ఉల్లంఘన కారణాలతో వాట్సన్‌తోపాటు మరో ముగ్గురు క్రికెటర్లపై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేశారు. సరైన హోంవర్క్ చేయలేదనే కారణంతో షేన్ వాట్సన్, ఖవాజా, మిచెల్ జాన్సన్, జేమ్స్ ప్యాటిన్సన్‌పై వేటు వేశారు.

అప్పట్లో ఇది పెద్ద వివాదాస్పదమైంది. అయితే అలాంటి పరిస్థితులు వచ్చే నెలలో జరగనున్న పర్యటనలో పునరావృతం కావని బలంగా తాను నమ్ముతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వాట్సన్ తెలిపాడు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 29 వరకు భారత్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌కు 16 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో నలుగురు స్ఫిన్నర్లకు చోటు కల్పించారు. అయితే భారత పర్యటనలో స్పిన్నర్లతోనే టెస్టుల్లో విజయం సాధించలేమని వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
2004 భారత పర్యటనలో గ్లెన్ మెక్‌గ్రాత్, కాస్ర్పొవిచ్, గిలెస్పీ లాంటి పేసర్లు ఉండగా, కేవలం ఒకే ఒక్క స్పిన్నర్‌గా షేన్ వార్న్ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయినా సరే ఆ పర్యటనలో ఆస్ట్రేలియా విజయం సాధించిందని వాట్సన్ గుర్తు చేశాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాట్ రెన్‌షాపై షేన్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. భారత పర్యటనలో రెన్ షా తప్పక రాణిస్తాడని చెప్పుకొచ్చాడు. గతంలో రెన్ షా ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగాడని, భారత పర్యటనలో కూడా తన గేమ్ ప్లాన్‌ని ఓ పథకం అమలు చేస్తాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications