For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణముంది: రిటైర్మెంట్ ప్రకటించిన వాట్సన్

మొహాలీ: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించాడు. ఐసిసి ప్రపంచ టీ20 టోర్నమెంటు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవనున్నాడు. అయితే, దేశవాళీ టీ20 మ్యాచ్ లతోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో కొనసాగనున్నట్లు తెలిపాడు.

'అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే నాకు సరైన సమయం' అని వెల్లడించాడు. గురువారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడనున్న సందర్భంగా వాట్సన్ ఈ మేరకు ప్రకటించాడు.

నిరుడు యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన వాట్సన్.. గత సెప్టెంబర్ నుంచి వన్డేలకు దూరంగా ఉన్నాడు. క్రికెట్ కు వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఒకింత గర్వంగా ఉందని తెలిపాడు.

Australia's Shane Watson to retire after World T20

తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి తరచూ గాయాల బారిన పడటం కూడా కారణమేనని వాట్సన్ తెలిపాడు. ఈ టోర్నీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరమవుతున్నట్లు చెప్పాడు.

ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో, టెస్టు, టీ20ల్లో అద్భుత విజయాలనందించాడు వాట్సన్. వాట్సన్ 59 టెస్టులు, 190 వన్డేలు, 56 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2002లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచుతో వన్డేల్లో అరంగేట్రం చేసిన వాట్సన్.. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతని టెస్ట్ కెరీర్ లో 35.0 సగటుతో 4 సెంచరీలు నమోదు చేశాడు.

టెస్టుల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 176. కాగా, బౌలింగ్ వేసి 75 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 9 సెంచరీలు, 33 అర్ధ శతకాలు నమోదు చేసి, 5,757 పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో 167 వికెట్లు తీశాడు. వన్డేల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 185. టీ20ల్లో ఒక సెంచరీతోపాటు 10 అర్ధ శతకాలు నమోదు చేశాడు. టీ20ల్లో 46 వికెట్లు తీశాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు 124 నాటౌట్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+